పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

173 గరిమ నతఁడే చక్రము చేఁబట్టగ సురిగి పారిరదేం చూడుఁడు సురలు చ. పదిలపు విష్ణుడె ప్రాణమై యుండఁగ యిదివో మెలఁగేరు యీజీవులు మొదలను యితఁడే మూలమై యుండఁగ పాదలె నీతని పంపున లోకములు చ. శ్రీవేంకటాద్రిని శ్రీపతి యుండఁగ తావుల నిలిచెను ధర్మములు యీవల నితఁడే యిచ్చేటి వరముల పావనులైరిదే ప్రపన్నులు రేకు:0268-02 లలిత సంపుటము: 03–390 పల్లవి: ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దుగునుసుతా వోడక నీదండ చేరి వున్నారమయ్యా చ. ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు వాసుల శ్రీపతి మిమ్మ వడి నాత్మఁ దలఁచుక యివాసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా చ. యేలినవారు వెట్టగా నేపునఁ దొత్తులు బంట్లు ఆలకించి పరుల బోయడుగనట్టు తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా చ. చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను యీతల నే వెలుతులు నెరఁగమయ్యా రేకు: 0301-06 లలిత సంపుటము: 04-006 పల్లవి: ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగలినాఁడు యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు చ. యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము పూతకిచన్ను దాగి పొదలినాఁడు యీతఁడా వసుదేవుని యింటిలో నిధానము చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు చ. మేటియైన గొంతిదేవి మేనల్లుఁ డీతఁడా కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను పాటించి పెంచే యశోదపాలి భాగ్య విూఁతఁడా వాటమై గొల్లెతలను వలపించినాఁడు చ. ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను మిగుల శ్రీవేంకటాద్రిమీఁది దైవమితఁడా తగి రామకృష్ణావతార మందె నిప్పుడు రేకు:0218-04 భైరవి సంపుటము: 03-099 పల్లవి: ఆతఁడు భక్తసులభుఁ డచ్యుతుఁడు రాత్రిగుండెవాఁడుగాఁడు రంత్రు మానుఁ డిఁకను చ. జీవుఁడా వేసరకు చిత్తమా జడియకు దైవము గరుణించఁ దడవు గాదు