పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

170 సేతు కైలాసములు చిరభూములిన్నియును పై త్రోవలట పరమ భాగవతులకును చ. అమరావతమడ్డమా హరి దాసులకు మహా తిమిరంబులడ్డమా దివ్యులకును కమలాసనుని లోకంబదియు నడ్డమా విమలాత్ములై వెలుఁగు విష్ణు దాసులకు చ. పరమపద మడ్డమా బ్రహ్మాండధరుఁడైన ధర వేంకటేశ్వరుని దాసులకును యిరవైన లోకముల నిన్నిటా భోగించి వరుసలను విహరించు వరవైష్ణవులకు రేకు: 0367-03 లలిత సంపుటము:04-395 పల్లవి: ఆచార విచారా లవియు నే నెరఁగ వాచామగోచరపు వరదుఁడ నీవు చ. తపమొక్కటే నాకుఁ దగు నీ శరణనుట జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ చ. కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు ధర్మమొక్కటే నీ దాసాను దాస్యము మర్మమొక్కటే నా మతి నిన్నుఁ దలఁచుట అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ చ. బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట కలిమి యొక్కటే నీవు గలవని నమ్ముట యెలమితో శ్రీ వేంకటేశ నీవు గతిదక్క పలుబుద్దులు నేఁబొరలు భావనలేనెరఁగ పె.అ.రేకు:0054-06 నాట సంపుటము: 15-310 పల్లవి: ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె నేచి నన్ను రక్షించేది యిఁక నీ చేతిది చ. వరుసఁ బుణ్యము లెల్లా స్వర్గమున కొప్పగించు సరుసనే చదువులు సంశయముల కొప్పించు సురలఁ బూజించుపూజ క్షుద్రవిద్యల కొప్పించు కెరలి నీ కృప కొప్పగించ నెవ్వరు లేరు చ. ఘనసంకల్పములు భోగములకు నొప్పగించు పొనిగి కర్మము లెల్లా పుట్టుగుల కొప్పగించు ధనము లంపటముల తగులున కొప్పగించు కినిసి నీ సేవ కొప్పగించ నెవ్వరు లేరు చ. సారె నేర్చిన నేర్పులు సంసారమున కొప్పించు అరయఁగోరికె లెల్లా నజ్ఞానమున కొప్పించు ధారుణి శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి కేరి నీ దాస్యాన కొప్పగించ నెవ్వరు లేరు పె.అ.రేకు:0022-02 బౌళి సంపుటము: 15-124 పల్లవి: ఆజ్ఞానజంతువ నేనైతిఁ గాక సుజ్ఞానమూర్తివి నీవు చూచుట తగవా చ. కోరితే రావలెఁ గాన కోరనివి రానేల కోరితిమా దుఃఖములు గోవింద నిన్ను