పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

171 ఆరయ పాపఫలము లవి యంటివా నీవు యేరీతి నాత్మవు నీవు యిఁక దోషమున్నదా చ. అనాథనాథుఁడవు ఆతురబOధుఁడవు సనాథుఁడను నేను సరి నుండఁగా వినోద మిది నీకు విశ్వప్రపంచము మనోధర్మముల నీ మాయ దాఁటఁగలనా చ. సరి గజదంతపరీక్షలు చూడ నెంతవాఁడ ధర శ్రీ వేంకటేశుఁడ దాసుఁడ నీకు గురువు నీ కొప్పగించె కోరి నీకు శరణంటి నిరతిఁ జేకొంట గాక నేర్పు నేరాలున్నవా పె.అ.రేకు:0037-06 గుజ్జరి సంపుటము: 15-212 పల్లవి: ఆట యెవ్వరికిఁ గొర నేను అంతర్యామికి కాక తటుకున నితఁడే గతి యని యున్నాఁడ తప్పకననుమన్నించీఁగాక చ. హరిదాసానుదాఁసుడ నట నా కాచార్యత్వము సంగతులా అరుదుగ విషయచ్చు మోచుకొని యన్యులఁ గొలిచిన నమ్మదురా విరతి బొంది యిఁక విషయము గోలిన వెనకటి పగ లివి సాధించవా యిరవున నే మొరవెట్టఁగ నిటు నా యేలిక దానే కాచీఁ గాక చ. సకలపుణ్యముల ఫలము లొల్ల నని స్వర్గము చొరనిఁకఁ బాడి యానా ఆకటా తిరుమంత్రము నుడువునోరధములఁ బొగడఁగజవి యానా వికటపు మోహమున నరకెద నని భావించి పారితే వెను కొనదా మొకమెదుటనె వేలుచు నుండఁగ మురహరుఁడే దయఁజూచీఁగాక చ. శ్రీవైష్ణవధర్మము చేపట్టి జిగిఁ బిరికితిన మిది యేల దేవతాంతరము మాని కమ్మటి తెరువు దప్పపీూనము గాదా వేవేలు చదువులు చదివి ప్రాకృతుల వేఁడుచుఁ దిరిగినను నవ్వరా శ్రీవేంకటేశుఁడే గతియని యుండఁగ చేరితఁడే రక్షించీఁ గాక పె.అ.రేకు: 0066-01 బౌళి సంపుటము: 15-376 పల్లవి: ఆటవానికివలెఁ దోడయిన్యాఁ బ్రకృతి గాటపు జీవుని కెంత కైవసమో ప్రకృతి చ. చాటి చదివినవెల్లా సారెఁ దలంపించి యిచ్చు పాటించి యక్షిణి విద్య ప్రకృతి తేటగాఁ దొల్లిఁటి జన్మము దెచ్చి యీ జన్మాన నిచ్చు చీటికి మాటికి యిచ్చిన దిచ్చుఁ బ్రకృతి చ. వొక్కచో నుండినవాని నొక్కచోఁ బొడచూపించును పక్కన పాసికవిద్య ప్రకృతి దుక్కినేలఁ జల్లిన విత్తులు కొటారు కెక్కించు వొక్కటే యనేకముగా నొనరించుఁ బ్రకృతి చ. మనసులోఁ దలఁచితే మర్మములు గరఁగించు పనివడి యింద్రజాలమై ప్రకృతి ప్రకృతి యేనలేని శ్రీవేంకటేశ యీ జీవులకు పనిగొంటివి సంసారఫలము యీ ప్రకృతి రేకు:0027-02 కన్నడగౌళసంపుటము: 01-163 పల్లవి: ఆటవారిఁ గూడి తెరా ఆటవారిఁ గూడి అన్నిచోట్ల బొమ్మ లాట లాడించ నధికుండైతివి చ. గురుతరమగు పెద్దకొట్టాములోపల తిరుమైన పెనుమాయఁ దెరగట్టి