పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

169 నీలో నుండఁగ నెలఁ గనెఁ గిరీటి మూల భూతి వగు మూర్తివి గాన చ. అనOత్ర శిరసుల ననOత్ర పదముల ననOత్ర నయనము లనOత్ర కరముల ఘన నీ రూపము గనుఁగొనెఁ గిరీటి అనంత మూరితి వన్నిటఁ గాన చ. జగము లిన్నియును సకల మున్నీంద్రులు - నగు శ్రీ వేంకటనాధుఁడ నిన్నే పారెగడఁగఁ గిరీటి పారెడగనె నీ రూపు అగణిత మహిముఁడ వన్నిటఁగాన రేకు:0026-03 ముఖారి సంపుటము: 01-158 పల్లవి: ఆఁకటివేళల నలపైన వేళలను తేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు చ. కొఱమాలి వున్నవేళ కులము చెడినవేళ చెఱఁవొడి వొరులచేఁ జిక్కినవేళ వొఱపైన హరినామ మొక్కటే గతిగాక మఱచి తప్పిననైన మఱిలేదు తెరంగు చ. ఆపద వచ్చినవేళ యూరడిఁబడినవేళ పాపపు వేళల భయపడినవేళ వోపినంత హరినామ మొక్కటే గతిగాక మాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు చ. సంకెళఁ బెట్టినవేళ చంపఁ బిలిచిన వేళ అంకిలిగా నప్పులవారాఁగిన వేళ వేంకటేశునామమే విడిపించ గతిగాక మంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు రేకు: 0378-06 రామక్రియ సంపుటము: 04-458 పల్లవి: ఆంజనేయ యనిలజ హనుమంత నీ - రంజకపుఁ జేఁతలు సురల కెంచ వసమా చ. తేరిమీఁద నీ రూపు దెచ్చిపెట్టి యర్జునుఁడు కౌరవుల గెలిచె నంగర భూమిని సారెకు భీముఁడు పురుషామృగముఁ దెచ్చుచోట నీరోమములు గావా నిఖిల కారణము చ. నీమూలమునఁగాదె నెలవై సుగ్రీవుఁడు రామునిఁ గిరెలిచి కపిరాజాయను రాముఁడు నీవంకనే పాశీ రమణి సీతాదేవిఁ బ్రేమముతో మగుడను బెండ్లాడెను చ. బలుదైత్యులను దుంచ బOటతనము మించ కలకాలమును నెంచఁగలిగిత్రిగా అల శ్రీ వేంకటపతి యండనే మంగాఁబుధి - నిలయపు హనుమంత నెగడితిగా రేకు:0047-03 భూపాళం సంపుటము: 01-288 పల్లవి: ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా శ్రీకాంతు భజియించు సేవకులకు చ. పాతాళమడ్డమా బలిమథను దాసులకు భూతలం బడ్డమా పుణ్యులకును