పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 గుదిగొను భయదపుఁ గోరలును అదరు మీసములు నలరంగ నవ్వుచు వుదుటు తోడఁ గొలువున్నాఁడు వాఁడె చ. అత్రిసిత్ర నఖములు ననOత్ర భుజములు వితతపరాక్రమ వేషమును అతులదీర్ఘజిహ్వయుఁ గడు మెరయుఁగ మితిలేని కరుణ మెరసీ వాఁడే చ. సందడి సామ్ములు శంఖచక్రములు పారెందుగ దివిజులు పారెగడగను యిందిరం దొడపై నిడి శ్రీవేంకటమందు నిందు గడుఁ నలరీ వాడే రేకు: 0152-04 సాళంగనాట సంపుటము: 02-243 పల్లవి: అహోబలేశ్వరునకు నాదిమూర్తికి విహారమే పంతము వీరసింహమునకు చ. చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు మిక్కుటపు వేదములు మించుఁగొస వెంట్రుకలు రక్కసులఁ జెండే విదారణసింహమునకు చ. శైలములే పాదములు జానువులే లోకములు కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు పాలించే ప్రతాపపు సింహమునకు చ. అంతరిక్షమే నడుము అట్టె భూమియే పిరుఁదు వంతఁ గృపారసము వార్డులెల్లాను యింతటా శ్రీవేంకటాద్రి యిరవు మహాగుహ రంతు లురుములు ఘనోరరౌద్రసింహమునకు పె.అ.రేకు:0077-01 వరాళి సంపుటము: 15-441 పల్లవి: ఆ మూరితియే యీ మూరితి అందు నిందు ఖేదము లేదు సోమర్కనేత్రుఁడ విశ్వరూపములు చూచినవారమే మును నేము చ. బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకు నీ మాయ చూపితివి విలసిల్లఁగ రణభూమిని నరునకు విశ్వరూప మటు చూపితివి అలరిన నీ రూపు జలమధ్యంబున ఆక్రూరున కటు చూపితివి చెలఁగి కుమారస్వామికి నా రూపు శ్రీవేంకటగిరిఁ జూపితివి చ. దైవికముగ దుర్యోధను సభను ప్రతాపము నీ రూపు చూపితివి ఆ విధముననే నీరూపు ముదంకు నా శ్రమమున నీటు చూపితివి నీవిధ మెఱుఁగని భీష్మకునకు మఱి నిర్మలరూపము చూపితివి శ్రీవేంకటగిరి నారూపంబే చేరి పరుషలకుఁ జూపితివి చ. పుట్టినప్పుడే వసుదేవునకు చతుర్భుజముల నీ రూపు చూపితివి జట్టిగ గొల్లెతలకు రూపము రా సక్రీడలలోఁ జూపితివి యిట్టే నారదునకు ద్వారకలొ యింటింట నీ రూపు చూపితివి పట్టుగ శ్రీవేంకటేవ్వర ఆ రూపమె మాకిప్పుడు చూపితివి రేకు: 0378–05 సామంతం సంపుటము: 04-457 పల్లవి: ఆ రూపమునకే హరి నేను మొక్కెదను చేరి విభీషణుని శరణాగతుఁడని చేకొని సరిఁ గాచితివి చ. ఫాలలోచనుఁడు బ్రహ్మయు నింద్రుఁడు సాలి నగ్నియును సూర్యచంద్రులును