పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

161 రేకు: 0346-01 సాళంగనాట సంపుటము: 04–268 పల్లవి: అలబ్రహ్మాదుల కణఁగ దిది గెలువఁగ వశమా కేశవ మాకు చ. పాపము మనసునఁ బారకమూనదు కోపము మానఁగఁగూడదు యేపున దేహం బెన్నాళ్లు మోఁచెను తీపుల యిది యా దేహపుగుణము చ. ఆఁకలిదీరదు యుటు నానాఁటికి కాఁకలు మానవు కాంత లేక మాఁకువంటి జన్మము గలకాలము చీఁకటి దేహపు చిత్తపుగుణము చ. నీవు వొసఁగినదె నిర్మలదేహము నీవె నా నేర్పునేరములు శ్రీవేంకటేశుఁడ జిగి నీ శరణని దీవెనఁ బొందితి దేహపు గుణము రేకు: 0065–05 భూపాళం సంపుటము: 01-338 పల్లవి: అలర నుతించరో హరిని యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము చ. సేయరో మనుజులార చింత హరినిఁకనైన రోయరో మీ భుజియించు రుచులమీఁద కాయు మస్థిరము యూకలి మధ్రువము చాలఁ బోయఁబో యెందుకుఁగాకపాశీయఁ గాలము చ. మెచ్చరో మనుజులార మీరే హరికథలు పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకునిచ్చీని శుభములు యివి యెల్లకాలము చ. కనరో వేంకటపతిఁ గన్నులుదనియఁగా వినరో యీతనిస్తుతి వీనులు నిండ మనరో శ్రీహరిచేతిమన్ననలు మీరు తనమీఁది మది ಬುದ್ದಿ దాఁచీనిఁ గాలము రేకు:0011-01 ఆహిరి సంపుటము: 01-067 పల్లవి: అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు సేసె నీవుయ్యాల పలుమారు నుచ్చ్యాసపవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల చ. ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల చ. మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల నీలశైలమువంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూచు నుయ్యాల వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల చ. కమలకును భూసతికి కదలు కదలుకుమిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల అమరాఁగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల పె.అ.రేకు: 0067-03 నాట సంపుటము: 15-384 పల్లవి: అలసితిని పుణ్యపాపముల ఆకలిఁబడి నేను