పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 గెలిచితిని నిన్నుఁ గొలిచి యింకఁ గీర్తింపుచు నిర్మలుఁడనైతిని . యింక నేను యీ పదునాలుగు లోకముల చొచ్చి యెన్నాళ్ళు దప్పించుకొనువాఁడ యింక నేను నేఁ జేసిన దానంబులు చూపి యెందాఁకాఁ బెనఁగెడువాఁడ యింక నేను నా పుత్రమిత్రుల నడుమ నెట్టు దాఁగఁ గలవాడ యింక నేను యిల దివ్యతీర్ధముల వెంటవెంట నెక్కడని పారేడఁ గలవాఁడ . యింక నేను నానాదేవతల మఱుఁగునను యేది గొలది దొబ్బఁ గలవాఁడ యింక నేను బహు జంతురూపములు గైకొని యేపగిదిని బొంకఁగలవాఁడ యింక నేను మంత్రములు జపంచి యేరీతి మాయల గెలిచేటివాఁడ యింక నేను సంసారము చూపి యేమని నమ్మించఁ గలవాఁడ . యింక నేను నీ దాసుఁడనై ఇటువలె నుండఁ గలవాఁడ యింక నేను నీవే గతి యని యిహముఁ బరముఁ జేకొనువాఁడ యింక నేను అలమేలుమంగకు యీశ్వరుఁడవైన శ్రీవేంకటేశా యింక నేను ఆచార్యుననుమతి హృదయములోపలఁ దలఁచువాఁడ రేకు:0178-05 శ్రీరాగం సంపుటము:02–390 పల్లవి: అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు పోల్చ నెంతపనికిఁ బూనితినయ్యా చ. నీపదధ్యానములోనే నిండెను నామన సెల్ల యేపున నీసాకార మేమిట భావింతునయ్య చూపు నీసింగారమందే చొక్కి తగులాయ నిదె ఆఁపి నే నీయంగకాంతుల వేమిట జూతునయ్య . నాలుక నీకడలేని నామములే నుడిగీవి మేలిమి నీగుణము లేమిటC బొగడుదునయ్య గాలివంటివీనులు నీకథలఁ దనిసెనయ్య యీలీల నీయనంతమహిమ యెందు విందునయ్య . నీకు శరణని యిట్టె నే ధన్యుఁడనైతి యీకడ నీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య శ్రీకాంతుఁడవైన శ్రీవేంకటేశ నీకు వూఁకొన నాజన్మఫల మొకమొక్కు చాలునయ్య రేకు: 0362-02 సామంతం సంపుటము: 04-364 పల్లవి: అల్లదెకో విజయధ్వజము జగ - మెల్లఁ జేకొనియె నీతఁడు చ. తొక్కనిచోట్లు దొక్కెటి తురగపు రెక్కలమీఁదటి రేవంతుఁడు చక్కుగ నసురల సంహరించి యిదె దిక్కులు గెలిచెను దేవదేవుడు . వోడక శంఖము నొగి చక్రముతో సూడుకుఁ దిరిగేటి శూరుఁడు యూడనుండి సురలిందలిఁ గాచెను మేడెపు మన లక్ష్మీవిభుఁడు . శరణన వారలఁ జయ్యన గాచిన శరణాగత రక్షణ ఘనుఁడు తిరమై యింతకు దిక్కె నిలిచెను గరిమెల శ్రీ వేంకట ప్భుఁడు పె.అ.రేకు:0045-01 మాళవి సంపుటము: 15-253 పల్లవి: అల్లనాఁడే కంటి వింటి నథిక్షజా అల్లుకొంటి విని చెలుల నధోక్షజా