పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

160 రేకు: 0347-05 గౌళ సంపుటము:04-278 పల్లవి: అణిముటి హనుమంతుఁ డట్టిబంటు వెఱపు లేని రఘువీరునికి బంటు చ. యేలికను దైవముఁగా నెంచి కొల్చేవాఁడే బంటు తాలిమిగలిగిన యాతఁడే బంటు పాలుమాలక యేపొద్దు పనిసేయువాఁడే బంటు వేళ గాచుకవుండేటి వెరవరే బంటు చ. తను మనోవంచనలెంతటా లేనివాఁడే బంటు ధనముపట్టున శుద్ధాత్మకుఁడే బంటు అనిశము నెదురు మాటాడనివాఁడే బంటు అనిమొనఁ దిరుగనియతఁడే బంటు చ. చెప్పినట్లనే నడచినయాతఁడే బంటు తప్పలేక హితుఁడైనాతఁడే బంటు మెప్పించుక విశ్వాసాన మెలఁగువాఁడే బంటు యెప్పుడును ద్రోహిగాని హితుఁడే బంటు చ. అక్కర గలిగి కడు నాపుఁడైనవాఁడే బంటు యొక్కడా విడిచిపోనియిషుఁడే బంటు తక్కక రహస్యములు దాఁచినవాఁడే బంటు కక్కసీఁడుగాక బత్తిగలవాఁడే బంటు చ. కానిపనులకు లోనుగానివాఁడే బంటు ఆనాజ్ఞ మీరనియాతఁడే బంటు నానాగతి శ్రీవేంకటోన్నతుఁడైనయతనికి తా నిన్నిటా దాసుఁడైనధన్యుఁడే బంటు రేకు:0223–02 దేవగాంధారిసంపుటము: 03-127 పల్లవి: అణిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా చ. నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య పన్ని యూతనినే చూచి పాతకులమైన మమ్ము మన్నించవయ్య వో మధుసూదనా చ. సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య అంకెల నీసన్నిధినే అదిగోవయ్య అంకించి నే వారివాఁడనని దుషుడనైనా నాసంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా చ. పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా