పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 రేకు:0265-03 లలిత సంపుటము: 03-374 పల్లవి: అరసి నన్నుఁ గాచినాతనికి శరణు పరము నిహమునేలే పతికిని శరణు చ. వేదములు దెచ్చినట్టి విభునికి శరణు ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు యేదెసాఁ దానై యున్నయినాతనికి శరణు శ్రీదేవిమగఁడైన శ్రీపతికి శరణు చ. అందరికిఁ బ్రాణమైన అతనికి శరణు ముందు మూఁడుమూర్తులమూర్తికి శరణు దిందుపడి దేవతల దేవునికి శరణు అంది మిన్నునేల నేకమైనతనికి శరణు చ. తానేఁ చేతన్యమైన దైవానకు శరణు నానాబ్రహ్మాండాలనాథునికి శరణు ఆనుక శ్రీవేంకటాద్రియందునుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు రేకు:0296-03 వరాళి సంపుటము: 03-556 పల్లవి: అరిగాఁపులము నేము అంతర్యామివి నీకు (వు?) యిరవై నీ చెప్పినట్టు యేమి సేతుమయ్యా చ. గాలి ముడి గట్టినట్టు కాయము మోచితిమి కాలము గొలచితిమి కనురెప్పల జాలి రొప్పితిమి వట్టి సటలనే యేపొద్దు యేల మెచ్చవింకాను యేమి సేతుమయ్యా చ. చుక్కలు లెక్కించినట్టు చూడఁగ మా జన్మములు వుక్కునఁ గర్మములకు నొడిగట్టితి (இ)?) తెక్కులను వెంటవెంటఁ దిరిగేము బంట్లమై యొక్కువాయు వెట్టి మాకు నేమి సేతుమయ్యా చ. పాలు వొంగినటువలెఁ బాయము మోచితిమి నాలుక కెక్కినవెల్లా నమలితిమి యీలీల శ్రీవేంకటేశ ఇంత సేసితివి యేలినవాఁడవు ఇంకా నేమిసేతుమయ్యా రేకు:0048-02 ముఖారి సంపుటము: 01-294 పల్లవి: అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ సరిలేక వుండితివి జలరాశికాడ చ. పొలియం బీర్చితి వొకతిఁ బురిఁటి మంచముకాడ నలఁచిత్రి వోరెకని గగనంబుకాడ బలిమిఁ దన్నితి వొకని బండిపాశీతులకాడఁ దులిమితివి యేడుగురఁ దోలి మందకాడ చ. త్రడవి మోదిత్రి వోరెకని తాటిమూఁకులకాడ. నడిచితివి వొకనిఁ బేయలకాడను పిడిచివేసితి వొకని బృందావనముకాడ వొడిసితివి వొకని నావులమందకాడ చ. పటపటన దిక్కులు పగుల బగతులఁ దునిమి నటియుంచితివి మూమనగలికాడ కుటిలబహుదైత్యాంతకుఁడవు వేంకటరాయ పుటమెగసితి జగంబులయింటికాడ