పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

155 సరుస నట్టే వేదమూఁ జదువుదురు నిరతి శ్రీవేంకటేశ నీ మహిమ లెరఁగక అరిది వైష్ణవులమే యని యూడుకొందురు రేకు:0220-01 గుజ్జరి సంపుటము:03–108 పల్లవి: అయ్యో సదా మత్తుఁడను హరి నీ దాసులు నన్ను ఇయ్యెడనే దయఁజూచి యీడేర్చిరిఁ గాక చ. తెగక కన్నులుమూసి దేహము మఱచేవాఁడ నిగిడి దేవుఁడవని నిన్నెరిఁగేనా తగఁ బసిఁడి చూచి నే ధర్మము మరచేవాఁడ జగతి విజ్ఞానము సరవెరిఁగేనా చ. వలచి సతులనేటి వలలఁ బడేటివాఁడ మలసి తప్పించుక నీ మాయ దాఁటేనా వెలయ నన్నీఁ జదివి వివేకమొల్లనివాఁడ చలివాసి నీభక్తి చవిగొనేనా చ. మించు సంసారము చొచ్చి మీఁదు దెలియనివాఁడ నంచ నీ వంతర్యామివని మొక్కేనా యెంచక శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి మంచిదాయ నిఁక నిది మానబొయ్యేనా రేకు:0029-04 సామంతం సంపుటము: 01-179 పల్లవి: అయ్యోపాయఁ బ్రాయముఁ గాలము ముయ్యంచు మనసున నే మోహమతినైతి చ. చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు వట్టి యాసలఁ బెట్టువారే కాక నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ బెట్టనేరక వృధా పిరివీకులైతి చ. తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక మిగుల వీరలపాందు మేలనుచు హరినాత్మఁ దగిలించ లేక చింతాపరుఁడనైతి చ. అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును వంతువాసికిఁ బెనఁగువారే కాక అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు సంత కూటముల యలజడికి లోనైతి