పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 పల్లవి: అయ్యో యేమరి నే నాఁ డప్పుడేమై వుంటినో అయ్యడ నీ దాసి నైతే ఆదరింతుగా చ. అల్లనాఁడు బాలుఁడవై ఆవులఁగా చేవేళ చిల్లర దూడనైతే చేరి కాతువుగా వల్లెగా విటుఁడవై రేపల్లెలో నుండే నాఁడు గొల్లెత నయినా నన్ను కూడుకొందుగా చ. మేలిమి రామావతారవేళ రాయి రప్పనైనా కాలు మోపి బదికించి కాత్రువుగా వాలి సుగ్రీవులవద్ద వానరమై వుండినాను యేలి నన్నుఁ బనిగొని యీడేర్తువుగా చ. వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాఁడు నీరులో జంతువునైనా నీవు గాతువుగా యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిఁగా రేకు:0106-03 రామక్రియ సంపుటము: 02-033 పల్లవి: అయ్యో వారిభాగ్య మంతేకాక నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు చ. దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా కావరపు జీవునకు గతుగతుకే చ. హరి శరణంటేఁ గాచే అట్టియుపాయమే వుండఁగ విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను చ. యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను అక్కటా మూడున కెందు ననుమానమే మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే రేకు:0209-04 లలిత సంపుటము: 03-052 పల్లవి: అయ్యో వికల్పవాదులంతటా సిగువడరు యియ్యోడ నెట్టుగలిగె నీ యసురమతము చ. నీ ముద్రలూ నొల్లరు నీదాసాహము నొల్లరు కామించి నీ మీఁది భక్తి కడు నొల్లరు నామమంత్రము నొల్ల రనామయుండ వనెందురు తాము వైష్ణవుల మంటాఁ దర్కింతురు చ. పైతృకవేళ నీపస్తాదమూ నొల్లరు ఘాతల నూర్ధ్వపుండ్రము గాదందురు జాతర దైవాల నిన్ను సరిగాఁ బూజింతురు ఆతల వైష్ణవులు దామనుకొందురు చ. శ్రీవైష్ణవులఁ గంటేఁ జేతులెత్తి మొక్కరు భావింతురు పగవారిఁబలెఁ గన్నట్టు ఆవల వైకుంఠమూ ననిత్యమందురు కావించి వైష్ణవులము కామా నేమందురు చ. 4: వరుస రావణాదుల వలె నెజ్జాలు సేతురు