పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

153 పల్లవి: అయ్యో నా నేరమికే అట్టే యేమని వగతు ముయ్యంచు చంచలాన మోసపోతిఁ గాక చ. కాననా నావంటివారే కారా యీ జంతువులు నానాయోనులఁ బుట్టి నడచేవారు మానక నా గర్వమున మదాంధమున ముందు గానక భయపడిన కర్మ నింతేకాక చ. చదువనా నేఁ దొల్లి జన్మజన్మాంతరముల ఇది పుణ్య మిది పాప మింతంతని వదలక నా భోగవాంఛలే పెంచి పెంచి తుద కెక్క వెదకని దుషుఁడ నేను చ. విననా నేఁ బురాణాల వెనకటివారినెల్ల మనెడి భాగవతుల మహిమ లెల్లా యెనయుచు శ్రీవేంకటేశు కృపచేత నేడు ఘనుఁడ నయితిఁ గాక కష్టుఁడఁగానా రేకు:0114-02 లలిత సంపుటము:02-080 పల్లవి: అయ్యో నేనేకా అన్నిటికంటెఁదీలు గయ్యాళినై బ్రిధా గర్వింతుఁగాని చ. తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు వుడివోక వనములో వొప్పెనవిరులు నేముడిచి వేసినంతనే ముట్టరాదాయను చ. వెక్కసపు రచనల వేవేలు రుచులు నా వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు పక్కన దేవారపుఁ బరిమళ గంధములు నాముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను చ. గగనాననుండి వచ్చేగంగాజలములైన వొగి నాగోరంటితేనే యోగ్యము గావు నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక మొగడై యెరుక తుదిముట్టరాదాయను రేకు:0102-06 బైరవి సంపుటము:02-012 పల్లవి: అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు చ. చుక్కలై యుండినవారు సురలై యుండినవారు యిక్కడనుండి పోయిన యీజీవులే దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు చ. పాతాళవాసులను పలులోకవాసులును యీతరవాత నుండిన యీ జీవులే కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు చ. యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బదులు యిరవై మనలోనున్న యీజీవులే సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు పె.అ.రేకు:0001-06 బౌళి సంపుటము: 15-006