పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 పల్లవి: అమ్మే దొకటియును యసిమలో దొకటి యని కమ్ముకొని నీయందే కలిగె నీమాఁట చ. సరవితో నిను నుపనిషద్వాక్యములయందు పురుషోత్తముడవనుచుఁ బొగడఁగాను అరిది నారాయణివియై యమృత మొసంగుచో అరయ శ్రుతిదె విరోధంబాయ నీమాఁట చ. తలపోయ ధర్మసంస్థాపనుఁడవని నిన్ను చెలరేగి శాస్త్రములు చెప్పఁగాను తలఁక కిటు గోప పరదారగమనము నీవు యిలఁ జేయ శాస్త్రవిరహితమాయ నీమాఁట చ. వైకుంఠపతి వనుచు వడిఁ బురాణములెల్ల యేకమొకటే వశింుంచఁగాను యీకడ శ్రీ వేంకటేశ్వరుఁడవైతి విదె చేకొలఁది నిటు నీకె చెల్లు నీమాఁట రేకు: 0353-05 సాళంగనాట సంపుటము: 04-313 పల్లవి: అయమేవ అయమేవ ఆదిపురుషో జయకరO తమపూO శరణO భజామి చ. అయమేవ ఖలు పురా అవనీధరస్తు సో ప్యయమేవ వట దళాగ్రాధి శయనః అయమేవ దశవిధైరవతారరూపైశ్చ నయమార్గ భువి రక్షణం కరోతి చ. అయమేవ సతతం బ్రియః పతిర్దేవేషు అయమేవ దుష్ట దైత్యాంతకస్తు అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య ప్రియ భక్త పోషణం ప్రీత్యా తోతి చ. అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే అయమేవ వరదోపి యాచకానాం అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో వ్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు రేకు: 0049-03 నాట సంపుటము: 01-300 పల్లవి: అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు తన కయ్యపుఁగంగఁ గానఁడు చ. పాపపుణ్యలంపటుఁడైనా దష్టరూపుడూ జన్మరోగి యటుగాన పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి యేపొద్దు వొడలెరఁగఁడు చ. నరకభవనపరిణతుఁడైనా కర్మ పురుషుఁడు హేయభోగి యటుగాన దురితపుణ్యత్రిదోషజ్వరము పట్టి అరవెరమాట లాడీని చ. దేహమోహస్థిరుఁడైనా ని ర్వాహుఁడు తర్కవాది యటుగాన శ్రీహరి వేంకటశ్రీకాంతునిఁ గని వూహలఁ జేరనొల్లఁడు రేకు:0207-03 ఆహిరి సంపుటము: 03-039