పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 పల్లవి: అప్పలేని సంసార మైనపాటే చాలు తప్పలేనిజీత మొక్క తారమైనఁ జాలు చ. కంతలేని గుడిశోక్క గంపంతయినఁ జాలు చింతలేని యంబలోక్క చారెఁడే చాలు జంతగాని తరుణి యేజాతైన నదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు చ. తిట్టలేని బ్రదుకొక్క దినమైన నదె చాలు ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు వట్టి జాలిఁ బడకుంటే వచ్చినంతే చాలు చ. లంపటపడని మేలు లవలేశమే చాలు రొంపి కంబమూ కంటె రోయుటే చాలు రంపపుఁగోరిక కంటె రతి వేంకటపతిపంపున నాతనిఁ జేరే భవమే చాలు రేకు: 0273-03 బౌళిరామక్రియ సంపుటము: 03-420 పల్లవి: అభయదాయకుఁడ వదె నీవే గతి యిభరక్షక నను నిపుడు గావవే చ. భయహర దై తేయభంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వరా నియతము మా కిదె నీ పాదములే గతి క్రియగా మమ్మేలి కింక లుడుపవే చ. బOధవిమోచన పాపవినాశన సింధురవర దాగ్రితరక్ష కంధరవర్జుఁడ గతి నీ నామమె అంధకారముల నణఁచి మనుపవే చ. దైవశిఖామణి తత చక్రాయుధ శ్రీవేంకటగిరి శ్రీరమణా సావధాన నీ శరణ్యమే గతి వేవేలకు నావిన్నప మిదియే రేకు:0080-02 పాడి సంపుటము: 01-383 పల్లవి: అభయమభయమో హరి నీకు విభుఁడ వింతటికి వెర విఁక నేది చ. జడిగొని మదిలో శాంతము నిలువదు కడుఁగడు దుస్సంగతి వలన యిడుమలేని సుఖ మించుక గానము అడియూసల నా యలమటవలన చ. తలఁపులోన నీతత్వము నిలువదు పలు లంపటముల భ్రమవలన కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను వెలి విషయపు పిరివీకుల వలన చ. పక్కనఁ బాపపు బంధము లూడెను చిక్కక నినుఁ దలఁచిన వలన చిక్కులు వాసెను శ్రీవేంకటపతి నిక్కము నా కిదె నీకృప వలన రేకు: 0305–02 దేవగాంధారి సంపుటము: 04-026