పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

149 కప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగలనాఁడు చ. ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పినినాఁడు పాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిననాఁడు కోపములకు శాంతములకుఁ గూటమి మానిననాఁడు లోపల వెలుపల తనమతిలోఁ దెలిసిననాఁడు చ. తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిన నాఁడు మనసునఁ జైతన్యంబున మఱపందిననాఁడు పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులఁ గనుఁగొని నీభావముగాఁ గనువిచ్చిననాఁడు పె.అ.రేకు:0009-05 గౌళ సంపుటము: 15-054 పల్లవి: అప్పుడే కృతార్జుఁడు అప్పుడే లోకపూజ్యఁడు తప్ప లేదు ముప్పు లేదు దైవమే గురుతు చ. ఎవ్వఁడు పుణ్యుఁడు గాఁడు యెవ్వఁడు పాతకి గాఁడు యివ్వలఁ దొంటి జన్మము లెంచి చూచితే నెవ్వగనీ జీవునికీ నేరుపేది నేర మేది అవ్వల శ్రీహరి శరణన్నదే గురుతు చ. పుట్టని కులము లేవి భుజించని వస్తువేది యిట్టే యీ జీవుల నెల్లా యెంచి చూచితే గుట్టు దెలిసితి మిందు కొంచమేది దొడ్డ యేది అట్టు నిట్టు హరిదాసుఁడైనదే గురుతు చ. ఎఱిఁగి సేసు టేది యెఱుఁగక మానుటేది తఱిఁ బ్రపంచమునందుఁ దలపోసితే మెఱయ పరుస మంటే మణి పైఁడే మిను మేమి గుఱిగా శ్రీ వేంకటేశుఁ గొలుచుటే గురుతు రేకు:0013-05 దేసాళం సంపుటము: 01-081 పల్లవి: అప్పలవారే అందరును కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ చ. ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ జిక్కులు సిలుగులుఁ జింతలునే దిక్కెవ్వరు యీ తీదీపులలో దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక చ. యేది దలంచిన నేకాలంబును సూదులమూ (టల సుఖములివి కాదన నె°ననఁ గడ గనిపించఁగ పాదికాఁడు తలఁపునఁ గలడోకఁడే చ. యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీ బన్నిన తమతమ బంధములు వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు రేకు:0019-02 గుజ్జరి సంపుటము:01-114