పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 అప్పసము మాకె కలఁ డన్నమయ్యా చ. అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన యంతరంగాన నిలిపీ నన్నమయ్యా సంత్రసానc జెలుపొందె సనకసనందనాదు లంతటివాఁడు తాళ్లపాకన్నమయ్యా చ. బిరుదు టెక్కెములుగా బెక్కు సంకీర్తనములు హరిమీఁద విన్నవించె నన్నమయ్యా విరివిగలిగినట్టి వేదముల యర్థ మెల్లా అరసి తెలిపినాఁడు అన్నమయ్యా చ. అందమైన రామానుజాచార్యమతమున అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా విందువలె మాకును శ్రీవెంకటనాథుని నిచ్చె అందరిలో దాళ్లపాక అన్నమయ్యా రేకు:0120-03 భూపాళం సంపుటము:02-117 పల్లవి: అప్పుడు చూచేదివో అధికుల నధముల తప్పక యెచ్చరి యిదే తలఁచవో మనసా చ. కొండలవంటి పనులు కోరి ముంచుకుంటే నూర కుండి కైకొననివాఁడే యోగీంద్రుఁడు నిండిన కోపములకు నెపముల గలిగితే దండితోఁ గలఁగని యూతఁడే ధీరుఁడు చ. సూదులవంటి మాటలు సారిదిఁ జెవి సాశీఁకితే వాదులు వెట్టుకొననివాఁడే దేవుఁడు పాదుకొన్న సంసారబంధము నోరూరించితే ఆదిగొని మత్తుఁడు గానెట్టివాఁడే పుణ్యుఁడు చ. గాలాలవంటి యూసలు కడుఁ దగిలి తీసితే తాలిమితోఁ గదలనాతఁడే ఘనుఁడు మేలిమి శ్రీవేంకటేశుమీఁద భారము వేసుక వీలక తనలో విఱ్ఱవీఁగువాఁడే నిత్యుఁడు పె.అ.రేకు: 0066-02 భౌళి సంపుటము: 15-377 పల్లవి: అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు వుప్పతిల్లు తత్త్వజ్ఞానికి వూహింపుచు నుండఁగవలెను చ. సాలీని మతి పడుగు చరిసేసే యందే యుండు గాలిపు బెండుపై వేఁటకాని కుండును వాలాయించి దృష్టి వింటివానికి గుఱిపై నుండు యీ లీల తత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను చ. దున్నేవానికి మనసు తొలుతఁ జాలుపై నుండు పన్ని జూజరికి నాటపై నుండును సన్నలఁ గోమటిచూపు సరకులపై నుండు యెన్నఁగాఁ దత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను చ. భూమిలో దొంగకు చింత పొద్దు పైనే వుండు కాముకుని తలపోఁత కాంతపై నుండు ఆముకొని శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండును సాముగా తత్త్వజ్ఞానికి సాధింపుచు నుండవలెను రేకు:0006-07 లలిత సంపుటము: 01-043 పల్లవి: అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి