పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

147 తప్పకుండా దైవమునే తలఁచపోయి జీవుఁడా చ. తచ్చిన యాహారము తరవాతనే నిద్ర వచ్చు సురతాంతమున వైరాగ్య(ము గచ్చుల కర్మాంతమునఁ గానవచ్చునల పెల్లా మెచ్చుల సత్యము కొన మించి యుండు ధర్మము చ. పసిఁడి వెచ్చించునాఁడె పట్టును లోభము లెల్లా ముసలితనాన వచ్చు విసు వెల్లాను వెస సంసారపు వేళనే యాసలు వుట్టు పొసగి యిట్టె జ్ఞానముపొంత నుండు సుఖము చ. కోపము దేరినమీఁద కూడవచ్చు శాంతము చేపట్టి భక్తి గలిగితే చేరు మోక్షము యేపొద్దు శ్రీవేంకటేశు నెడయక శరణంటె కాపాడి యతఁడే యిచ్చు ఘనబ్రహ్మానందము రేకు: 0348-06 నాదరామక్రియ సంపుటము: 04-284 పల్లవి: అప్పటి సుఖమేకాని యటమీఁదెంచు కొనఁడు ఉప్పతిల్లు జీవుని వుద్యోగా లిట్టివి చ. తనుభోగపురతులు దలపాశీయుచుండుఁగాని తన నరకకూపాలు దలపాశీయుఁడు కనకభూషణములు గని వెరగందుఁగాని ఘనకర్మబంధాలకుఁ గడు వెరగందఁడు చ. యీకడాకడఁదాఁ జేసేటియెమ్మెలే యెంచుఁగాని పైకొని కూడేటిపాపము లెంచఁడు దీకొని జగములోని ద్రిష్టములే చూచుఁగాని భీకరపు జన్మముల పిరివీకు చూడఁడు చ. వింతవింత మాటలవేడుకలే వినుఁగాని అంతటఁ దాఁ బడేపాట్లవి వినఁడు ఇంతటా శ్రీవేంకటేశుఁడేలఁగా నెరిఁగెఁగాని యెంతచెప్పినాను ಬುದ್ದಿ యిన్నాళ్ళు నెరఁగఁడు రేకు: 0306-05 పాడి సంపుటము:04-035 పల్లవి: అప్పడైనహరి యొక్కె నదివో తేరు యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు చ. సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు భ్రమయ జరాసంధుపైఁ బరపెఁదేరు తిమురుచు రుక్మకుపైఁ దిరుగఁ దోలెఁ దేరు ప్రమదాన సృగాలునిపైఁ దోలెఁ దేరు చ. కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు బమ్మరపో దంతవక్షపైఁ దోలెఁ దేరు దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁదోలినతేరు దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు చ. మిటి హంసడిచికులమీఁదఁ దోలినట్టితేరు తూటి సంధిమాటలకుఁ దోలినతేరు అఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి చూఱలుగొన నెక్కెను శోభనపుతేరు చి.ఆ.రేకు:0004-05 సాళంగనాట సంపుటము: 10-023 పల్లవి: అప్పనివరప్రసాది అన్నమయ్యా