పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

146 కన్నులు వేవేలుగల ఘనుడితఁడు చ. వేదాంతకోట్ల విభుఁడితఁడు నాదబ్రహ్మపు నడుమితఁడు ఆది నంత్యములకు నరుదితఁడు శ్రీ దేవుఁడు సరసిజనాభుఁడితఁడు చ. భవముల8ణCచు యుదుపతి Oుతఁడు భువనములిన్నిటికిఁ బొడవితఁడు దివికి దివమైన తిరమితఁడు పవనసుతు నేలినపతి యితఁడు చ. గరుడని మీఁదటి ఘనుఁడితఁడు సిరులిందరికి నిచ్చే చెలువితఁడు తిరువేంకటనగము దేవుఁడితఁడు పరమపదమునకుఁ బ్రభుఁడితఁడు రేకు:0167-05 భూపాళం సంపుటము:02-326 పల్లవి: అపరాధిని నేనైనాను కృపగలవారికిఁ గపటములేదు చ. సనాతనా అచ్యుతా సర్వేశ్వరా అనాది కారణ అనంతా జనార్ధనా అచల సకల లోకేశ్వరా నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా చ. పురాణపురుషా పురుషాత్తమా చరాచరాత్మక జగదీశా పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా యిరవు నీవే యుట యెఱిఁగించఁగదే చ. దేవోత్తమా శశిదినకరనయనా పావనచరితా పరమాత్మా శ్రీవేంకటేశా జీవాంతరంగా సేవకుఁడను బుద్ధి చెప్పఁగవలయు రేకు: 0109-02 శంకరాభారణం సంపుటము: 02-050 పల్లవి: అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు యిప్పుడిట్టిమహిమల నెక్కుడాయ నీతఁడు చ. చేకొని తొలితొలుతే చేసిన పన్నీరుకాపు జోకఁ గాలువలై సారిది జార సైకపునీలాద్రినుండి జలజల బారేటిరేకల సెలయేరులరీతి నున్న దిదివో చ. తెప్పలుగా గుప్పినట్టి తెల్లని కప్పరకాపు చిప్పిలుచు వెన్నెలలై చిందఁగాను పుప్పాడిఁదోఁగిన కల్పభూజము నిలుచున్నచొప్పున నున్నాఁడిదివో సాంపులు మీరుచును చ. పొందుగ నంతటిమీఁదఁ బూసిన పునుగుకాపు కందువ మాణిక్యముల గనియైనట్టు అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ చెంది యరతఁ గట్టఁగా శ్రీవిభుఁడై నిలిచె పె.అ.రేకు:0041-02 కన్నడగౌళ సంపుటము: 15-232 పల్లవి: అప్పటప్పటివేలలు నన్నియు వివేకించి