పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

145 పన్నిన సుజ్ఞానికి బయలై తోఁచు చ. తిరుపై యవ్వలవ్వలఁ దిరుగుచుండేటివేళఁ దిరిగినట్లనుండు దిక్కులెల్లాను సిరుల సంసారభ్రమఁ జిక్కిన జీవునికిని పరగ నైహికమే పరమై తోఁచు చ. సొగసి యద్దమునీడ చూచినవేళఁ దనకు మగుడ వేణోకరూపు మతిఁ దోఁచును తగిలి యిటూనేపో తనుఁదా నెఱఁగకున్న నిగిడిన పుట్టువులు నిజమై తోఁచు చ. కదిసిన సకలాంధకార మంతటాఁ గప్పి వుదయమైతే నన్నీ నొదిగినట్టు హృదయపు శ్రీవేంకటేశుఁడు వెల్లవిరైతే మదిలో నజ్ఞానము మాయమై తోఁచు రేకు:0115-06 దేవగాంధారి సంపుటము: 02-090 పల్లవి: అన్నియునుఁ దనఆచార్యాధీనము చెన్నుమీఱ హరిపాదసేవ చేయు మనసా చ. దైవమూఁ గొంచము గాఁడు తానూ గొంచము గాఁడు భావించి కొలచేవారి పరిపాటి చేవలం బత్తిముదుగు చేని ముదుగూ లేదు వావిరిఁ బోఁగెత్తేటి వారివారి నేరుపు చ. కాలము కడమలేదు కర్మము కడమ లేదు కేలి విశ్వాసము గలిగిన పాటి వ్రాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు పోలించేటి విద్వాంసుల బుద్ధిలోని నేరుపు చ. జ్ఞానానకుఁ దప్పులేదు జన్మానకుఁ దప్పులేదు నానాటికి వివేకించి నడచేపాటి పానిపట్టి శ్రీవేంకటపతి యింతకు మూలము ఆనుక యీతని శరణనేవారి నేరుపు రేకు: 0309-03 దేవగాంధారి సంపుటము: 04-051 పల్లవి: అన్నివిధములుఁ దానై యాతుమలో మరి వీఁడే పన్నిన యీ పరమాత్మభావనే మా బ్రదుకు చ. గోపాలకృష్ణునిచూపే కోరిన పనులపాఁడి గోపికావల్లభుకృపే కూర్మివనిత శ్రీపతిదయే మాకుఁజేరే ధనధాన్యములు చేపట్టిన బ్రహ్మతండ్రిచిత్తమే మాపుత్రులు చ. జలధిశాయికరుణే సర్వరత్నములసామ్మ అల పీతాంబరువాత్సల్యమే వస్త్రములు మలయు గరుడధ్వజుమన్ననే వాహనములు యిల నచ్యుతనామమే యిదే మాకాయుష్యము చ. అమృతమథను మహిమదే మా గాదెల కొల్చు విమతదైత్యారి యావేశమే భయహరము అమర శ్రీవేంకటేశు నడుగులే మాకు నిండు తమితో నాతనిదేవే తల్లియుఁ దండ్రియును రేకు: 9035-01 భూపాళం సంపుటము: 04-554 పల్లవి: అన్నివిభవముల అతఁడితఁడు