పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 కన్నుల వేడుకకు కడయేది యిఁకను చ. కామధేనువు గలిగి?)తే గర్వించు నొక్కరుఁడు భూమి యేలితే నొకఁడు పొదలుచుండు కామించి నిధి గంటె కళలమించు నొకఁడు శ్రీమంతుఁడగు హరి చిక్కె మాకు నిదివో చ. పరుసవేదిగలిగి?)తే పంతములాడు నొకఁడు ధరఁ జింతామణబ్బితే దాఁటు నొకఁడు సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకఁడు పరమాత్ముఁడే మా పాలఁ జిక్కెనిదివో చ. అమృతపానము సేసి యానందించు నొకఁడు భ్రమను దేహసిద్ధి బరగిరికఁడు తమి శ్రీవేంకటేశుఁడే దాఁచిన ధనమై మాకు అమరి నా మతిఁ జిక్కె నడ్డములే దిదివో రేకు: 0261-06 సామంతం సంపుటము: 03-354 పల్లవి: అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో చ. వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా యెదువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో చ. యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో చ. యేడదో యీదేహమూత్ర యేనేమి నెఱఁగఁగా కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా యీడనే శ్రీవేంకటేశుఁడిట్టే నన్నుఁ గాచెఁగా నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో రేకు:0003-07 శ్రీరాగం సంపుటము: 01-020 పల్లవి: అన్నియును నతని కృత్యములే యెన్నియైనానవునతఁడేమి సేసినను చ. అణురేణు పరిపూరుఁడవలి మోమైతేను అణువెను కమలభవాండమైన ఫణిశయనుని కృపాపరిపూర్ణమైతే తృణమైన మేరువె స్థిరముగా నపుడే చ. పురుషోత్తముని భక్తి పొరపాచ్చమైతే ఎరవులౌ నిజసిరులు ఎన్నెనను హరిమీఁది చింత పాయక నిజం బైతే నిరతిఁ బట్టినవెల్లా నిధానములే చ. మదనగురుని సేవ మదికి వెగటైతేను పదివేలు పుణ్యములు పాపంబులే పదిలమై వేంకటపతి భక్తి గలిగితేను తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే రేకు: 0113-03 బౌళి సంపుటము:02-075 పల్లవి: అన్నియును హరి సేసే యటమటాలే యివి