పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

143 మన్నించి నా కీజన్మ మొసంగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు చ. పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నెనో తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్నఁడు చ. చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తిదా నదియంతో కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా చ. గరిమల నే గడియించినయుండుఁ గాణాచిచోట్లు యేడేడో పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు అరయంగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో రేకు:0266-03 మాళవి సంపుటము: 03-379 పల్లవి: అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే మున్నె నా భావముతో ముడిచివేసినది చ. చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి చెలగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి చ. పొసఁగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున ముసిపి మరొకాచారమున సన్యాసినైతి చ. వొగి నొడ్జెభాషలాఁడి వొడ్జెవాఁడనైతిని తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను తగు నీదాఁసుడనై దాసరి నేనైతి రేకు: 0333-01 గుండక్రియసంపుటము:04-190 పల్లవి: అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా చ. యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ వేడుకయ్యి బహురూపవిద్యలు చూడఁగను చ. నటన దినదినము నాటకమై యుండఁగాను సటవట నాటకాలు సారెఁ జూచేము ఘటన మూయలెదుటC గనుకట్టె వుండఁగాను అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము చ. పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను కోపుల నాటలవారిఁ గోరి చూచేము యేపున శ్రీవేంకటేశు డిటు మమ్ము భ్రమపాపె నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను రేకు:0206-05 మాళవిగౌళ సంపుటము: 03-035 పల్లవి: అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ జిక్కె