పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

142 విన్నవార కన్నవార విచారించు కొనుఁడీ చ. దైవమునుఁ దలఁచక తత్వమును నెఱుఁగక భావించుధ్యానము బట్టబయలు సుండీ తోవ దెలుసుకొనక దొడ్డమతసుడు గాక కావలెనంటే మోక్షము కలుగదు సుండీ చ. అతిభక్తి నిలుపక హరిఁ గొనియాడక వెతకేటి చదువులు వృథా సుండీ యితరము లుడుగక యిన్నిటిపైరోయక జతకాముఁడు గాఁబోతే చిక్కదు సుండీ చ. పాపములు విడువక పరిశుదుఁడు గాక యేపున జన్మఫల మీడేరదు సుండీ దాపుగా శ్రీవేంకటేశుదాసుఁడ నంటేఁ గాక తీపుల బ్రహ్మానందము తిరము గాదు సుండీ రేకు:0187-05 బౌళిరామక్రియ సంపుటము: 02-442 పల్లవి: అన్నిటికి హరి యంతర్యామి మూలము విన్నకన్న గతులెల్లా వృథా మూలము చ. లాలిత వైరాగ్యమూలము మోక్షము ఆలలిసOసారమూల మతిబంధము మేలిమిశాంతిమూలమే సుఖము వీలి క్రోధమూలమే వెడదుఃఖము చ. కైకొను భవములే కర్మమూలము శ్రీకాంతుపై భక్తి చిన్మూలము పైకొన్న ధ్యానమెల్ల భావమూలము దీకొని లంపటములు దేహమూలము చ. అరుదై సుజ్ఞాన మాచార్యుమూలము ధరణి జగత్తెల ధనమూలము పరము శ్రీవేంకటపతి మూలము పూలి నాత్రని శరణాగత్రి మూలము రేకు: 0375-02 లలిత సంపుటము:04-438 పల్లవి: అన్నిమంత్రములు నిందే యావహించెను వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశు మంత్రము చ. నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహ మంత్రము కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము వేరె నాకుఁగలిగె వేంకటేశు మంత్రము చ. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుఁడు జపించె నంగవించెఁ గృష్ణమంత్ర మరునుఁడును ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము చ. యిన్ని మంత్రములకెల్ల యిందిరా నాథుఁడే గురి పన్నినదిదియే పర బ్రహ్మమంత్రము నన్నుఁ గావం కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను వెన్నెలవంటిది శ్రీ వేంకటేశు మంత్రము రేకు:0143-01 గుజ్జరి సంపుటము:02-189 పల్లవి: అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి