పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

141 యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపాఁజు చ. జ్ఞానంద్రియము లైదు శరీరిలోపల ఆనక కర్మేంద్రియము లైదు తానకపు కామక్రోధాల వర్గము లారు యినానెలవు పంచభూతా లెంచు మూపాఁజు చ. తప్పనిగుణాలు మూఁడు తనువికారము లారు అప్పటి మనోబుద్ధ్యహంకారాలు వుప్పతిల్లు విషయము లుడివోని వొకఅయిదు యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌఁజు చ. ఆఁకలిదప్పియును మానావమానములను సోఁకిన శీతోష్ణాలు సుఖదుఃఖాలు మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ యేఁకటారఁ గడపేవా నెంచుకో మాపాఁజు రేకు:0155-05 దేవగాంధారి సంపుటము:02-261 పల్లవి: అన్నిటికి మూలమని హరి నెంచరు పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు చ. ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు అకట చక్కనివార మనుకొనేరు సకలపుణ్యపాపాల సంది జన్మములవారు వెకలి సంసారాలకే వేడుకపడేవారు చ. కామునియేట్ల దిగఁగారేటి దేహులు దోమటి తమబదుకే దొడ్డదనేరు పామిడి కోరికలకు బంటైనవారలు గామిడితనాలఁ దామే కర్తలమనేరు చ. యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు కతల మోక్షమార్గము గంటిమనేరు తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర మతకాన నున్నవారు మారు మలసేరు రేకు:0159-03 సామంతం (02-261)సంపుటము: 02-284 పల్లవి: అన్నిటికి మూలమని హరి నెంచరు పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు చ. ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు అకట చక్కనివార మనుకొనేరు సకలపుణ్యపాపాల సంది జన్మములవారు వెకలి సంసారాలకే వేడుకపడేవారు చ. కామునియేట్ల దిగఁగారేటి దేహులు దోమటి తమబదుకే దొడ్డదనేరు పామిడి కోరికలకు బంట్లేనవారలు గామిడితనాల దామే కర్తలమనేరు చ. యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు కతల మోక్షమార్గము గంటిమనేరు తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర మతకాన నున్నవారు మారు మలసేరు పె.అ.రేకు:0052-03 శుద్ధవసంతం సంపుటము: 15-295 పల్లవి: అన్నిటికి మూలము శ్రీహరియె సుండి