పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

139 మన్నించు నాతనికంటే మఱి లేరు దొరలు చ. తగు బ్రహ్మలోకముదాఁకా నెక్కిచూచిన మగుడఁ బుట్టే లోకాలే మనుజులకు తెగి యిచ్చే యింద్రాదిదేవతల వరములు యెగువదిగువలను యీ సందివే చ. మాయలోనఁ బుట్టేది మాయలోనఁ బెరిగేది కాయదారులకు నెల్లాఁ గలిగినదే సేయరాని పుణ్యమెల్లాఁ జేసి గడించుకోనేది చాయల బహురూపపు సంసారమే చ. చెడని వైకుంఠ మిచ్చుఁ జేటులేని వర మిచ్చు వెడమాయఁ బెడబాపు విష్ణుఁ డీతఁడే యొడయెక శ్రీవేంకటేశుఁడై వున్నాఁడు వీఁడే జడియ కితఁడే కాచు శరణంటేఁ జాలును రేకు:0322-01 నారాయణి సంపుటము: 04-124 పల్లవి: అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి కన్నులఁ బ్రహ్మదువలె కనుఁగొను టరుదా చ. పులుగు నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి వెలసి ఘనుఁడనOటూ విఱ్ఱవీఁగీని జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా చ. మానివోడ నమ్మొకcడు మహాజలధి దాఁటి నానార్ధములు గూర్చి నటియుంచీని శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు పూని భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా చ. దీపమువట్టి యొకఁడు తెగనిచీఁకటిఁ బాసి చూపులనిన్నిటిఁ గని సుఖమందీని చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁడోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా రేకు:0285-04 రామక్రియ సంపుటము: 03-491 పల్లవి: అన్నిటి మూలం బతఁడు వెన్నుని కంటెను వేల్పులు లేరు చ. పంచభూతముల ప్రపంచ మూలము ముంచిన బ్రహ్మకు మూలము పొంచిన జీవుల పుట్టుగు మూలము యెంచఁగ దైవము యితఁడే కాఁడా చ. వెనుకొని పొగడేటి వేదాల మూలము మునుల తపములకు మూలము ఘనయజ్ఞాదుల కర్మపు మూలము యెనలేని దైవ మితఁడే కాఁడా చ. అగపడి సురలకు నమృత మూలము ముగురు మూర్తులకు మూలము నగు శ్రీవేంకటనాధుఁడే మూలము యెగువ లోకపత్రి యితఁడే కాఁడా రేకు:0094-06 దేసాళం సంపుటము: 01-470 పల్లవి: అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు