పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

138 కొన్ని దైవములఁ గొలువఁగఁ దగునా చ. విహితకర్మముసేసి వెదకేటి హరి నిట్టె సహజమై కొలచేటి సరసునికి గహనపుఁ గర్మాలు కడమలైన నేమి మహిఁ గనక్రాదికి మరి పైఁడి వలెనా చ. పలుదానములకెల్ల బలమైన హరి నిట్టె బలుపుగ జేకొన్న భక్తునికిని నెలకొని యాతఁ డన్నియునుఁ జేసినవాఁడె తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా చ. వేదవేద్యుఁడు శ్రీవేంకటపతినామ మాదిగాఁ బలియించే యధికునికి ఆదైన చదువులు అఱచేతి వతనికి మేదినిఁ దిరుగాడ మెట్లు వలెనా రేకు: 9117-04 లలిత సంపుటము:04-606 పల్లవి: అన్నిటాఁ దాము నతిశయులే యెన్నఁగ నధికులె యెసఁగఁగను చ. పరంపరలగు భవముల( బొడమియు చిరంతనుసే జీవులిదే ధురంధరులే దురిత సుకృతముల జరామరణ విశారదులే చ. సదా బహుల విషయమత్తులయ్యు మదాతురులే మనుజులిదే ముదాసక్తులే మోహవిదూరులే చిదానందులే చిరయశులే చ. భృశం సుఖులే పుణ్యులందరు సుశాంతాత్ములే శుభమతులే విశారదులే వేంకటరమణుని వశంవదులే వరిషులే రేకు:0139-05 మలహరి సంపుటము: 02-170 పల్లవి: అన్నిటాను హరిదాసు లధికులు కన్నులవంటివారు కమలజాదులకు చ. అందరును సమమైతే నరుహానరుహము లేదా అందరిలో హరియైతే నౌఁ గాక బొందితో విప్టుని దెచ్చి పూజించినట్టు వేరే పారిOదుగాని శునకముఁ బూజించఁదగునా చ. అన్నిమతములు సరియైతేను వాసి లేదా చెన్నగుఁ బురాణాలు చెప్పఁ గాక యెన్నఁగ సార్ణాటంక మింతటానుఁ జెల్లినట్లు సన్నపుఁ దోలుబిళ్లలు సరిగాఁ జెలునా చ. గక్కునఁ బైరువిత్తఁగా గాదము మొలచినట్టు చిక్కిన కర్మములెల్లాఁ జెలఁగెఁ గాక తక్కక శ్రీవేంకటేశుదాస్య మెక్కుడైనట్టు యొక్కడా మోక్షోపాయ మిఁకఁ జెప్ప నున్నదా రేకు:0102-03 సాళంగనాట సంపుటము:02-009 పల్లవి: అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది