పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

137 యిన్ని నీవు పుట్టించిన విని నీసొమ్ములే చ. నిలిచిన రూపులెల్లా నీగుళ్లుగాఁ దలంతు మెలఁగేటి చైతన్యము మిమ్మగాఁ దలంతు యిలలోని ధ్వనులు నీపలుకులుగాఁ దలఁతు సకల పంచభూతా లుపకరణాలుగాఁ దలంతు చ. నారుకొన్న పంటలు నీనైవేద్యాలుగాఁ దలఁతు నీరెల్లా నీతీర్థమని నెమ్మిఁదలఁతు ధారుణి భోగాలు పూజాద్రవ్యాలుగాఁ దలఁతు నేరిచిన పనులెల్లా నీలీలలుగాఁ దలఁతును చ. కాలత్రయము నీగతులుగానే తలఁతు చాలి సురల నీయనుచరులఁగానే తలఁతు నాలోని శ్రీవేంకటేశ నాతండ్రివని తలఁతు తాలిమి నీదేవులను తల్లియని తలఁతును రేకు:0225-01 రామక్రియ సంపుటము: 03-138 పల్లవి: అన్నిటా నేరుపరి హనుమంతుఁడు పిన్ననాఁడే రవినంటె పెద్ద హనుమంతుఁడు చ. ముట్టిన ప్రతాపపు రాముని సేనలలోన అట్టె బిరుదుబంటు శ్రీహనుమంతుఁడు చుట్టి రానుండినయట్టి సుగ్రీవు ప్రధానులలో గట్టియైన లావరి చొక్కపు హనుమంతుఁడు చ. వదలక కూడినట్టి వనచర బలములో నదె యేకాంగవీరుఁడు హనుమంతుఁడు చెదరక కుంభకర్డు చేతి శూలమందరిలో సదరాన విలిచె జలీషణ హనుమంతుఁడు చ. త్రిజగముల లోపల దేవతాసంఘములోన అజుని పట్టాన నిల్చె హనుమంతుఁడు విజయనగరాన శ్రీవేంకటేశు సేవకుఁడై భుజబలుఁడై యున్నాఁ డిప్పడు హనుమంతుఁడు రేకు: 0190-05 బౌళి సంపుటము:02-460 పల్లవి: అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే సన్నుతిఁ దానేపాళీ సర్వదేవమయుఁడు చ. అత్తల మనసు యింద్రియాధీనమైతేను చిత్తజుఁడనెడివాఁడు జీవుఁడు దానే కొత్తగాఁ దనమనసే కోపాన కాధీనమైతే తత్తరపు రుద్రుఁడునుఁ దానే తానే చ. భావము వుద్యోగముల ప్రపంచాధీనమైతే జీవుఁడు బ్రహ్మాంశమై చెలఁగుఁ దానే కావిరి రేయింబగలు కన్నుల కాథీనమైతే ఆవలఁ జంద్రసూర్యాత్మకుఁడు దానే చ. కోరికఁ దన బ్రదుకు గురువాక్యాధీనమైతే మోరతోపులేని నిత్యముక్తుఁడు దానే ఆరయ శ్రీవేంకటేశుఁ డాతుమ ఆధీనమైతే ధారుణిలో దివ్యయోగి తానే తానే రేకు:0112-02 రామక్రియ సంపుటము: 02-068 పల్లవి: అన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి