పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 పల్లవి: అన్నిటా నిట్టే కాని యగపడదు అన్నమదమున జిత్త మగపడదు చ. సాలసి సంసారములో సుఖముఁ బొందేనంటే అలమటలేకాని యగపడదు పలుచదువులవంకఁ బరము గనేనంటే అల సంశయోకాని యుగపడదు చ. వెడదేహము మోఁచి విరతిఁ బొందేనంటే అడియాసలేకాని యగపడదు సడిఁ గోపమే యుండఁగ శాంతిఁ బొందేనంటే అడవిఁ బడుటేకాని యగపడదు చ. నేరిచి నీ మాయలోన నిజభక్తి గనేనంటే అరీతి నాఱడేకాని యగపడదు మేరతో శ్రీవేంకటేశ మించి నీకే శరణంటే ఆరి తేరి కర్మబంధ మగపడదు రేకు:0153-04 సాళంగనాట సంపుటము: 02-249 పల్లవి: అన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ వున్న చోటు నిశ్చింతమో హనుమంత చ. రాముని సేనలఁగాచి రావణు గర్వమడఁచి ఆముకొన్న బలవంత హనుమంతా గోమున జలధి దాఁటి కొండతో సంజీవి దెచ్చి ధీమంతుడవైతివింత దివ్య హనుమంత చ. చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోఁచె అక్కజపు నీ రూపంత హనుమంత చొక్కమై మీరుండఁగాను సుగ్రీవాదులకెల్లా అక్కర లేదించుకంతా హనుమంతా చ. జంగచాఁచి చేయెత్తి సరిఁ బిడికిలించుక అంగము నిక్కించితెంత హనుమంత రంగగు శ్రీవేంకటాద్రి రాముని దేవి కిచ్చితివంగులియ్యక మొక్కంత హనుమంతా రేకు:0080-05 బౌళి సంపుటము: 01-386 పల్లవి: అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను యెన్నఁగ నీవొక్కఁడవే గతియని యెంచికొలుచుటే ప్రపన్నసంగతి చ. యేకాంతంబున నుండినపతిని యెనసిరమించుటే సతిధర్మంబు లోకమురచ్చలోనుండినపతి లోఁగొని పైకొని రానట్లు యీ కొలఁదులనే సర్వదేవతలయిన్ని రూపులై నీ వున్నప్పుడు కై కొని నిను బహుముఖములఁగొలుచుట గాదు పతివ్రత వ్రత ధర్మంబు చ. పూనిన బ్రాహ్మణుల లోపలనే నినుఁ బూజించుట వేదోక్తధర్మము శ్వానకుక్కుటాదులోపల నిను సరిఁ బూజించఁగరానట్లు, యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీ శరణాగత జనులను కానక, వొక్కట సరిగాఁజూచుట కాదఁ వివేకధర్మంబు చ. శ్రీ వేంకటపతిగురువనుమతినే నేవే నాకును శిష్యధర్మము ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు భావింపఁగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము కైవశమై యిన్నిటా వెనుతగులు కాదవివేకధర్మంబు రేకు:0167-03 మలహరి సంపుటము: 02-324 పల్లవి: అన్నిటా నీవే వుందునందువుగా