పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

135 పల్లవి: అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా వన్నెల నప్పులుగొన్నవారువో వీరు చ. తెగనీక అప్పలెల్లాఁదీసితీసి | వారు తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి వెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కు పగల నప్పులుగొన్న వారువో వీరు చ. సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ రాయడికి లోలోనే రాసిరాసి కాయములో చొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్ను వ్రాయనిపత్రాల కాంగేవారువో వీరు చ. దొరయె యప్పలవారిఁ దోసితోసి | యీ పరిభవములనెల్లఁ బాసిపాసి సిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి . వరుసనే గెలిచినవారువో వీరు రేకు:0045-06 ముఖారి సంపుటము: 01-278 పల్లవి: అన్ని చోట్లఁ పరమాత్మ నీవు యున్నిరూపుల భ్రమయింతువుగా చ. పాలజలనిధినుండి బదరీవనాన నుండి ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి భూలోకనిధివై పురుషోత్తమాన నుండి వేలసంఖ్యలరూపై విచ్చేతుగా చ. వుత్తర మధురలో నయోధ్య లోపలినుండి సత్తెన నందవ్రజాన నుండి చిత్తగించి పంచవటి సింహాద్రిలోననుండి వత్తుగా లోకములు పావనము సేయఁగను చ. కైవల్యముననుండి కమలజలోకాన మోవఁగ శ్రీరంగమున నుండి యీవల నావల నుండి యీవేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా రేకు:0203-03 లలిత సంపుటము: 03-015 పల్లవి: అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు యెన్నికగాఁదుదిపద మెక్కితిమి మేలు చ. కొందరు జీవులు నన్నుఁ గోపగించినా మేలు చెంది కొందరట్టె సంతసించినా మేలు నిందించి కొందరు నన్ను నేఁడే రోసినా మేలు పాందుగ కొందరు నన్నుఁబొగడినా మేలు చ. కోరి నన్నుఁ బెద్దసేసి కొందరు మొక్కినా మేలు వేరే హీనుఁడని భావించినా మేలు కూరిమిఁ గొందరు నన్నుఁ గూడుకుండినా మేలు మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు చ. యిప్పటికిఁ గల పాటి యెంత పేదయినా మేలు వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు యెప్పుడు శ్రీవేంకటేశు కే నిచ్చిన జన్మమిది తప్పలే దాతనితోడి తగులమే మేలు రేకు: 0321-03 దేసాళం సంపుటము:04-120