పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

134 పల్లవి: అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా చ. అదివో కోనేటిలోన నదివో సర్వతీర్ధములు అదివో పైఁడిమేడల హరినగరు పాదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు యిదివో వరములిచ్చె నిందిరానాథుఁడు చ. అదివో వేదఘనోషము అదివో సురలమూఁక అదివో విశ్వరూపము అద్భుతమందె గుదిగొనెఁ బుణ్యములు కోట్ల సంఖ్యలు చేరె యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు చ. అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్ మంగ అదివో నిత్యశూరులు ఆళువారలు నిదుల శేషాచలము నిక్కి పైపైఁ బొడచూపె యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు రేకు: 0340-03 పాడి సంపుటము:04-234 పల్లవి: అనుచుఁ బొగడఁ జొచ్చెరదే బ్రహ్మాదులు మింట మొనసి యీ బాలునికే మొక్కేము నేము చ. వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు చ. పాలజలధిలోన పాయనిగోవిందుఁడు పాలు వెన్న లారగించె పైఁడికోరను వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు చాలి మంత్రసానులచే జలకమాడీని చ. ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు తగుబలభద్రునికి తమ్ముఁడాయను నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయు వీఁడే రేకు:0004-06 ముఖారి సంపుటము: 01-026 పల్లవి: అనుమానపు బ్రదు కది రోఁతా తన మనసెనయనికూటమి మరి రోఁతా చ. అపకీర్తులఁబడి ఆడికెలోనై అపవాదియూట అదిరోఁత్ర వుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలు విపరీతపు గుణవిధ మొకరోఁతా చ. తనగుట్టెల్లా నెరిఁగినవారలముందట తనయెమ్మెలు చెప్పుకొనుట రోఁత వనితలముOదట వదరుచు వదరుచు కనుఁగవ గాననిగర్వము రోఁత చ. భువి పూలి గత్రియని బుద్ధిఁదలంచని యవమానపుమన సది రోఁత భవసంహరుఁడై పరగువేంకటపతినవిరళముగఁ గొలువని దది రోఁత్ర రేకు: 0036-05 వరాళి సంపుటము: 01-224