పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

133 పల్లవి: అనుచు నిద్దరునాడే రమడలవలెనే మొనసి యివెల్లాఁ జూచి మైుక్కిరి బ్రహ్మాదులు చ. రాముఁడ పండ్లు నాకు రండు వెట్టరా యేమిరా యిటూనె నాకు యిత్తువా నీవు ప్రేమపుతమ్ముఁడఁగాన పిన్ననే నీకు యీమాట మఱవకు యిందిరాకృష్ణుఁడా చ. యొక్కిన వుట్టిపై నన్ను నెక్కించరా వోరి వుక్కునఁ బడేవు రాకు వద్దురా నీవు పక్కున మొక్కేరా నీపయిఁడికాళ్ళకు వోరి అక్కతోఁ జెప్పేఁగాని అందుకొనే రారా చ. యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా రవ్వల శ్రీవేంకటాద్రిరాయఁడనేరా అయితేయివ్వల నీకంటేఁ బెద్ద యిది నీ వెఱఁగవా రేకు: 0342-06 బైరవి సంపుటము:04-249 పల్లవి: అనుచు మునులు ఋషులంతనింత నాడఁగాను వినియు విననియట్టే వీడె యాడీఁగాని చ. ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు అకటా నందునికొరెడుకాయఁగాని శకుంతగమనుఁ డితడు సర్వేశుఁ డితఁడు వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని చ. వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుం డితఁడు కాదనలేక పసులఁ గాచీఁగాని ఆదిమూల మితఁడు యమరవంద్యుఁడితఁడు గాదిలిచేఁతల రోలఁగట్టువడెఁగాని చ. పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని పె.అ.రేకు:0027-06 బౌళి సంపుటము: 15-158 పల్లవి: అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె యినకులచంద్ర నేఁడిదిగో నీమహిమ చ. దదదద దదదద దశరథ తనయూ కదిసితిఁగకకక కావవే అదె వచ్చె బాణాలు హా నాథ హా నాథ పదపద పదపద పారరొ పవుంజులూ చ. మమమమ్మ మమమమ్మ మన్నించుఁడు కపులార సమరాన చచచచ్చ చావకుండా మెమెమెమ్మె మెమెమెమ్మె మేము నీ వారమె మొమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకు చ. తెతెతెత్తె తెతెతెత్తె తెరు వేది లంకకు తతతత్త తలమని దాఁగుదురూ గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు రేకు:0119-03 పాడి సంపుటము: 02-111