పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

132 పల్లవి: అని రావణుతల లట్టలుఁ బొందించి చెనకి భూతములు చెప్పె ಬುದ್ದಿ చ. కట్టిరి జలనిధి కపిసేన లవిగో చుట్టు లంక కంచుల విడిసె కొట్టిరి దానవకోట్ల తలలదే కట్టిడి రావణగతియో నీకు చ. యొక్కిరి కోటలు యిందరు నొకపరి చిక్కిరి కలిగిన చెరయెల్ల పక్కన సీతకుఁ బరిణామమాయ నిక్కె(క్క?)ము రావణ నీకో బ్రదుకు చ. పరగ విభీషణుఁ బట్టము గట్టెను తొరలి లంకకును తొలుఁదొలుతే గరిమెల శ్రీవేంకటగిరిరాముఁడు మొరసెను రావణ మేలాయఁ బనులు రేకు:0290-03 సామంతం సంపుటము: 03-520 పల్లవి: అనిశముఁ దలఁచరో అహోబలం అనంతఫలదం బహారోబలం చ. హరినిజనిలయం బహోబలం హరవిరించినుత మహోబలం అరుణమణిశిఖర మహోబలం అరిదైత్యహరణ మహోబలం చ. అతిశయశుభదం బహోబలం అతులమనోహర మహోబలం హతదురితచయం బహారోబలం యతిమతసిద్ధం బహోబలం చ. అగు శ్రీవేంకట మహోబలం అగమ్య మసురల కహోబలం అగపడుఁ బుణ్యుల కహోబలం అగకులరాజం బహారోబలం రేకు:0137-01 సాళంగనాట సంపుటము: 02-154 పల్లవి: అనుచు దేవగంధర్వాదులు పలికేరు కనకకశిపు నీవు ఖండించే వేళను చ. నరసింహ నరసింహ ననుఁగావు ననుఁగావు హరి హరి నాకు నాకు నభయమీవే కరిరక్షకరిరక్ష గతమైరి దనుజులు సురనాథ సురనాథ చూడు మమ్ముఁ గృపను చ. దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము భూవనితనాథ నాథ పాండమె నీప్రతాపము పావన పావన మమ్ముఁ బాలించవే చ. జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు భయపూర భయపూర పాప మడఁగె దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము దయఁజూడు దయఁజూడు దాసులము నేము రేకు:0103-02 రామక్రియసంపుటము: 02-014