పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

131 పల్లవి: అనాది విషయ విహారము గన ఆతుమ అనేకమై వీఁగె నందుకే యీ యాతుమ చ. అన్నిట కర్మపు(బంక మంటిన దీయూతుమ మున్ను కోప దుర్గంధములఁ బాఁగె నీ యాత్మ పన్ని భవముల తుప్పు పట్టిన దీయాతుమ యెన్నఁడు సుజ్ఞాన మింక నెరిఁగీనో యాత్మ చ. చెంచెలపుఁ దిప్ప పెంటఁ జివికిన దీయాత్మ పంచలయాసల నురిఁబడిన దీయాత్మ కంచపు భోగపుఁగాఁక గరివడీ నీయాత్మ యెంచి విజ్ఞానమెన్నఁ డెరిఁగీనో యాత్మ చ. యెలమితో శ్రీ వేంకటేశు కృప నీ యాత్మ తెలిసి యించుకించుక తేటపడె నాత్మ అలరి యాచార్యుని అధీనమైనాత్మ మలసి యజ్ఞానమెట్టు మరచెనో యాత్మ రేకు: 0345-01 మేఘరంజి సంపుటము: 04-262 పల్లవి: అని బ్రహ్మాదులెంచేరు హరిబాలలీలలు వెనక శుకాదులచే వింటిమి నేమిదివో చ. పొత్తులలోఁ బవ్వళించె పురుషోత్తముఁడు దొల్లి హత్తి మల్ట్రాకుపైఁ బండినటువలెనె వొత్తగిలి బోరగిలి వుండఁజొచ్చెఁ గృష్ణుఁడు తత్తరానఁ గూర్మావతారమైన గతిని చ. తప్పుటడుగులు వెట్టె తగఁ బ్రివిక్రముఁడై గొప్పపాదాలను భూమి గొలచినట్టు అప్పుడే కొదలు మాటలాడఁజొచ్చెఁ గృష్ణుఁడు తప్ప నసుర సతులఁ దగఁ బోధించినట్లు చ. అచ్చపు రేపల్లెలోన నాడఁజొచ్చెఁ గృష్ణుఁడు మెచ్చుల వైకుంఠాన మెరసినట్లు నిచ్చలు శ్రీవేంకటాద్రినిలయుఁడై యున్నవాఁడు అచ్పుగ జీవులలోన నాతుమైనయట్లు రేకు: 0187-01 లలిత సంపుటము:02-438 పల్లవి: అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో విని యూతని భజించు వివేకమా చ. భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల దీమసాననే మోచేటి దేవుఁడ నేను కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై తేమల బండించేటి దేవుఁడ నేను చ. దీపనాగ్నినై జీవదేహముల యన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను యేపున నిందరిలోని హృదయములోన నుందు దీపింతుఁ దలఁపు మరపై దేవుఁడ నేను చ. వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచేతా ఆది నేనెరఁగఁదగిన యూదేవుఁడను శ్రీదేవితోఁగూడి శ్రీవేంకటాద్రి మీఁద పాదైన దేవుఁడను భావించ నేను రేకు:0206-01 సాళంగనాట సంపుటము: 03-031