పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

129 పల్లవి: అనరాదు వినరాదు ఆతనిమాయలు నేఁడు దినదిన క్రొత్తలాయ బ్రిష్టమిదే మాకు చ. ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి యీడ మాతోఁ జెప్పగాను యిందరముఁ గూడిపోయి చూడఁబోతే పంచదారై చోద్యమాయెనమ్మా చ. తీఁటతీగెలు సామ్మంటా దేహమునిండా గట్టె తీఁటకుఁ గాక బాలులు తెగి వాపాశీఁగా పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను కోటికోటి సామ్ములాయ కొత్తలోయమ్మా చ. కాకిజున్ను జున్నులంటా గంపెఁడేసి తినిపించి వాకొలిపి బాలులెల్ల వాపోవఁగా ఆకడ శ్రీవేంకటేశుఁడా బాలుల కంటినీరు జోకగ ముత్యాలు సేసెఁ జూడఁగానే నేము రేకు:0188-02 బౌళి సంపుటము:02-445 పల్లవి: అనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన (నా?) ఘనపవిత్రమైనట్టు ఘనుఁడే పో జ్ఞాని చ. కాంచనము అంటువడినఁ గలదా అందు నింద్యము పెుOచు ముట్టంటువడినఁ బెక్కువ దూష్యము గాక అంచల సుజ్ఞానిఁ బాపమంటునా తాఁ జేసినాను పంచల నజ్ఞానినైతేఁ బైకొనిఁ గాక చ. యెఱుకగల నాలిక నింతైనా జిడ్డంటునా యెఱుకలేనిచేత నింతా జిడ్డంటుఁ గాక కఱతలయోగిని కర్మములివంటునా చుఅచుఱ జడునైతేఁ జుట్టుకొనుఁ గాక చ. తామెరపాకుల నీరు తగ నందు నంటునా ఆమేర నెందైనాను నంటుఁ గాక యిూమేర శ్రీవేంకటేశుని దాసుఁడు భూమిఁ గామించి తా నుండినానుఁ గడు మూయలంటునా పె.అ.రేకు:0064-03 బౌళిరామక్రియ సంపుటము: 15-366 పల్లవి: అనాథుల రక్షించేది అన్నిటాఁ బుణ్యము గాదా పెనఁగి నూతికట్ట బిడ్డఁ బట్టవలదా చ. నావలె మత్తుఁడవా నానా భోగలోలుఁడవా కావించి బుద్ధి Cయోఱుఁగనివాఁడవా భావించి నే జీవుండను ప్రకృతి ಯುಬ್ಧತೆಸೆಮಿ దేవుఁడవు నాలోనుండి తెలుపఁగ వలదా చ. చంచలచిత్తుఁడవా సంసారబదుఁడవా పొంచి నావలెనే నీ వకించనుఁడవా ముంచి తెరువెఱుఁగని మూడుఁడ నైతి నేమి యెంచి సంగడీఁడవు యెచ్చరించవలదా చ. యేమటేటివాఁడవా హీనగుణమువాఁడవా పామరపు నేఁతల బాగువాఁడవా నే మానిసి నైతే నేమి నీవు శ్రీవేంకటేశ్వర దోమటిచుట్టమవు పొందుగాఁ గావ వలదా రేకు: 0305–05 నారాయణి సంపుటము: 04-029