పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 పల్లవి: అనంత మద్భుత మాశ్చర్యం బిది సనాతనుఁడ నను సరవిఁ గావవే చ. బలిమి నసురలకు భయంకరుఁడవు అలరి యమరులకు నానందకరుఁడవు తలకొని బుషులకు తపఃఫలదుఁడవు పలు నీ మహిమలు పలుకఁగ వశమా చ. అరయ వేదముల కాధారంబవు పరగఁగ జీవుల ప్రాణనాథుఁడవు పరమయోగులకు పరబ్రహ్మమవు తిరముగ నీమూర్తి దెలియఁగ వశమా చ. జగముల కెల్లను సర్వబంధుఁడవు తగిలిన శ్రీకాంతకు నివాసమవు జిగి శ్రీవైష్ణువులకు శ్రీవేంకటపతివి త్రగు నీ కత్ర లివి త్రలఁచఁగ వశమూ రేకు:0214-03 దేసాళం సంపుటము: 03-081 పల్లవి: అనంతమహిముఁడవు అనంతశక్తివి నీవు యెనలేని దైవమా నిన్నేమని నుతింతును చ. అన్నిలోకములు నీయందు నున్నవందురు నీ వున్నలోక మిట్టిదని వూహించరాదు యొన్న నీవు రక్షకుఁడ విందరిపాలిటికి నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును చ. తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు యెల్లగా నీతల్లిదండ్రు లెవ్వరందును యిల్లిదె వరములు నీ విత్తు విందరికిని చెల్లఁబో నీకొకదాత చెప్పఁగఁ జోటేది చ. జీవుల కేలికవు శ్రీవేంకటేశుఁడవు నీ వేవలఁ జూచిన నీ కే యేలికే లేఁడు వేవేలు మునులును వెదకేరు నిన్నును నీవెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి రేకు:0167-02 మలహరి సంపుటము: 02-323 పల్లవి: అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని యెనలేని గుణాలు యేమి చూచేనయ్యా చ. దగ్గరి కొలుతు నాతరతమ్యమెంచుకోను సిగ్గువడ నిట్టే నిన్నుఁ జేరి పాడుదు వొగ్గి విన్నపాలు సేతు వుబ్బునఁ జిత్త మెరఁగ యెగులెంచితే నావల్ల నెన్ని లేవయ్యా చ. పాదాలంటి మొక్కుదును పరిశుద్ధి దలఁచను సాదించి కొలువవత్తు సత్వ చూడను యేదేసనైననా నుతింతు యెంగిలినోరని మాన పాదుగా విచారించితే బలుమూడుఁడనయ్యా చ. మంచముపైఁ దలపోతు మందెమేళమనియన కంచముకూడర్పింతుఁ గాదననేర యెంచఁగ శ్రీవేంకటేశ యిన్నిటా నీబంట నైతి పంచలఁ జూచితే నీపాలివాఁడనయ్యా రేకు:0139-02 దేసాక్షి సంపుటము: 02-167