పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

127 పల్లవి: అదెవచ్చె నిదివచ్చె నచ్యుతు సేనాపతి పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు చ. గరుడధ్వజంబదే ఘన శంఖరవమదె సరుసనే విష్ణుదేవుచక్రమదే మురవైరి పంపులవె ముందరిసేనలవె పరచి గగ్గుల కాడై పారరో దానవులు చ. తెల్లని గొడుగులవె దేవదుంధుబులునవె యెల్ల దేవతల రథాలింతటానవె కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజములవె పల్లపు పాతాళానఁ బడరో దనుజులు చ. వెండిపైఁడి గుదెలవె వెంజామరలవె మొండగు కైవారాలు మించినవవె దండి శ్రీవేంకటపతి దాడిముట్టెనడె యిదె బండుబండై జజ్ఞరించి పారరో దైతేయులు రేకు:0205-02 సాళంగనాట సంపుటము: 03-026 పల్లవి: అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా! వొక కొద్ది నీ దాసుల సేవ కోరఁగలఁ గాక చ. హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా అరిదైన దదియు రాచాజ్ఞ గనక పరమపదాన కాసపడుటయు ద్రోహము సారిది నీ భండారము సామ్మ గనక చ. పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా నించి నీవు పాఁతినట్టి నిధాన మది చ. వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా వెట్టి మమ్ముఁ జేయించేటి వేడుక నీది గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి అట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము రేకు: 9082-01 శంకరాభరణం సంపుటము: 04-584 పల్లవి: అధమునికి నను విధాయకులు విధింుంచరో విధిలోనఁ గొంత దుర్విధి నెరపినాఁడ చ. పాత్రకుని పాపాలు పరిహరింపించరో భూతంబులాల తోఁబుట్టులాల యేతులకు హరి దలఁచి యిటువంటి యీ మేన బూతుఁజేతలనె వొరపులు నెరపినాఁడ చ. పాపకర్మునికి భృగుపతనంబు చూపరో తాపత్రయములాల తమ్ములాల దీపించు హరి దలఁచి ధృతిలేక మరి మనో వ్యాపారములు గొన్ని వడిఁ దలఁచినాఁడ చ. చంచలున కేది నిశ్చయవిధి విధించరో పంచేంద్రియములాల బంధులాల ఎంచనరుదగు వేంకటేశ్వరుఁ బొగడునోర కాంచి యితరుల నాలికకుఁ జేర్చినాఁడ పె.అ.రేకు:0054-04 సాళంగనాట సంపుటము: 15-308