పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 పల్లవి: అదె వచ్చె రాఘవుఁ డాతని దాటి ముట్టె యెదిరించరాదు మీకు నేది దెరు విపుడు చ. భువిలోన రాముఁడై పుట్టెనట విషుఁడు అవల మీకు దిక్కేది యసురలాల తివిరి మిమ్ము వెదకె దివ్య బాణాలాతనివి రవళి నెందు చొచ్చేరు రాకాసులాల చ. చలపట్టి కొండలచే సముద్రము గట్టెనట తల చూపరాదు మీకే దైత్యులాల వలగొని దేవతలు వానరులై వచ్చిరట నిలువరా దిఁక మీకు నిశాచరులాల చ. రావణుఁ జంపెనటరణములోఁ జిక్కించుక దావతిఁ బారరొ మీరు దానవులాల యీ వేళ శ్రీ వేంకటేశుఁడితడే విభీషణుని లావున శరణనరో లంకావాసులాల రేకు:0087-02 శంకరాభరణం సంపుటము: 01-424 పల్లవి: అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని వెదకి వెదకి తిరువీధులందు దేవుఁడు చ. అలసూర్యవీధి నేఁగీ నాదిత్యునితేరిమీద కలికికమలానందకరుఁడుగాన తలపోసి అదియును దవ్వు చుట్టణికమని యిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు చ. చక్క సోమవీధి నేఁగీ జందురునితేరిమీఁద యొక్కువైన కువలయహితఁడుగాక చుక్కలు మోచిన దవ్వచుట్టరిక మిదియని యిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు చ. యింతులమనోవీధి నేఁగీ మరుతేరిమీఁద నంతటా రతిప్రియుఁడటుగాన ඊටෂ්ටෆ ෆපීඩCAC గానరానిచుట్టరికమని వింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు రేకు:0194-06 రామక్రియ సంపుటము: 02-485 పల్లవి: అదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో చ. ఆనాయుధో సో అసురా అదేవా యని వినోదముగ బుగ్వేదము దెలిపెడి సనాతనము విష్ణుచక్రధారణకును అనాది ప్రమాణ మందే తెలియరో చ. యొచ్చ యిండ్రే యని "యచ్చ సూర్యే" యని అచ్పుగ తుద కెక్కె(క్క?) నదే పొగడీ శ్రుతి ముచ్చట గోవిందుని ముద్రాధారణకు అచ్చమయిన ప్రమాణ మందే తెలియరో చ. మును "నేమినా తప్తముద్రాం ధారయే" త్రని వెనువెంట శ్రుతి యదె వెల్లవిరి సేసీని మొనసి శ్రీవేంకటేశు ముద్రాధారణకు అనువుగఁ బ్రమాణ మందే తెలియరో రేకు:0114-01 సాళంగనాట సంపుటము: 02-079