పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

125 విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవారగాను చ. యొక్కువల కెక్కువై యొసంగి వెలసిన పెద్ద యొక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద అక్కజంబైన పల్లవరాయని మటము అలయేట్లపేడ గడవ చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి మైుక్కుచును మోకాళ్ళమడుగు గడచిన మీఁదనక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు అంత్రంత్రC గానరాఁగాను చ. బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైన నానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షములనీడలను నిలిచి నిలిచి గగనంబు దాఁకి శృంగార రసభరితమై - కనకమయమైన గోపురములనుఁ జెలువొంది జగతీధరుని దివ్యసంపదలు గల నగరు సరుగననుఁ గానరాఁగాను చ. ప్రాకటంబైన పాపవినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగ తోయములు సాశీఁకిన భవము లంతంత వీఁడి పారంగను యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మునులెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని యేప్రొద్దు విహరించఁగాను రేకు: 0389-01 మాళవిగౌళసంపుటము: 04-514 పల్లవి: అదె లంక సాధించె నవని భారము దించె విదితమై ప్రతాపము వెలయించె నితఁడు చ. రవి వంశ తిలకుఁడు రాముఁ డితఁడు భువిఁ బుట్టె దశరథ పుత్రుఁడితఁడు భవుఁడెంచెఁ దారక బ్రహ్మ మీతఁడు పవనజు కిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు చ. బలువుఁడు సీతాపతి యితఁడు తలకొన్న వాలి మర్దనుఁడితఁడు విలసిల్లె నేకాంగ వీరుఁడితఁడు చలమరి కోదండ దీక్షా గురుఁడితఁడు చ. శరణాగత వజ్రపంజరుఁ డితఁడు సరిలేని యసుర భంజకుఁ డితఁడు వరదుఁడు శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడు అరయ విజయనగరాధీశుఁ డీతఁడు రేకు: 0391-05 నాట సంపుటము: 04-530