పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 యెదురులేదు నీకు నెక్కడా హనుమంతా చ. యెత్తిననీ కుడిహస్త మిల నసురలు చూచి హత్తిరి పాతాళము హనుమంతా చిత్తగించి నీ యెడమ చేతి పిడికిటికి తత్తరించి చిక్కిరదె దైత్యులు హనుమంతా చ. నలియం దొక్కిన నీ వున్నతపుఁ బాదముకింద నలమటించే రరులు హనుమంతా చలపట్టి నీవు జంగ చాఁచిన పాదహతిని బలుదానవులు భంగపడిరి హనుమంతా చ. వడి నీవు మీఁదికి వాలమల్లార్చిన అడఁగిరి రాక్షసులు హనుమంతా బడినే శ్రీవేంకటేశుపంపున నీవు గెల్వఁగ బెడిదమై పొగడేరు పెద్ద హనుమంతా రేకు: 0387-06 బౌళి సంపుటము: 04-509 పల్లవి: అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా చ. వుదయాస్త శైలములు వొక జంగగాఁ జాఁచె అదివో ధ్రువ మండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము బ్రిప్పుచు యెదుట నీతని మహి మేమని చెప్పేమయ్యా చ. దండిగా బ్రహ్మాండముదాఁకఁ దోఁక మీఁదికెత్తె మెండగు దిక్కులు నిండ మేను వెంచెను గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె అండనీతని ప్రతాప మరుదరుదయ్యా చ. దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరిబంటాయ మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా రేకు: 0037-01 మలహరి సంపుటము: 01-227 పల్లవి: అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొందీ ప్రభ మీరంగాను చ. తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందఁగాను చ. మిగుల నున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తపసులున్న గృహములును వొగి నొరగుఁ బెరుమాళ్ళ వునికి పట్టయివెలయు దిగువ త్రిరుపత్రి గడవఁగాను చ. పారెదలి యురయోజనము పాండవుననుఁ బొలుపారింది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదరకే వంక చూచిన మహాభూజములు సింహశారూలములును చ. కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును. గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు