పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

123 పదివేలుశేషుల పడగల మయము చ. అదె వేంకటాచల మఖిలవున్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము చ. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము చ. కైవల్యపదము వేంకటనగ మదివో శ్రీవేంకటపతికి సిరులైనది భావింప సకలసంపద రూపమదివో పావనములకెల్లఁ బావనమయము రేకు:0197-03 పాడి సంపుటము:02-498 పల్లవి: అదివో చూడరో అందరు మైుక్కరో గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని చ. రవిమండలమున రంజిల్లు తేజము దివిఁ జంద్రునిలో తేజము భువి ననలంబునఁ బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము చ. క్షీరాంబుధిలోఁ జెలఁగు సాకారము సారె వైకుంఠపు సాకారము యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము చ. పొలసిన యాగంబులలో ఫలమును పలు తపములలో ఫలమును తలఁచిన తలఁపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము రేకు:0105-01 వరాళి సంపుటము:02-025 పల్లవి: అదివో నిత్యశూ (సూ?)రులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు చ. రచ్చల సంసారమనే రణరంగములోన తచ్చి కామక్రోధాల తలలు గొట్టి అచ్చపు తిరుమంత్రపు టారుపు బొబ్బలతోడ యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు చ. మొరసి పట్టుగులనే ముచ్చుఁబౌఁజుల కురికి తెరలి నడుములకుఁ దెగవేసి పొరిఁ గర్మముఁ బొడిచి పోటుగంటులఁ దూరి యెరగొని త్రిరిగేరు యేకాంగవీరులు చ. వొడ్డిన దేహములనే వూళ్లలోపల చొచ్చి చెడ్డ యహంకారమను చెఱలువట్టి అడ్డమై శ్రీవేంకటేశు నండనుండి లోకులనేయొడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు రేకు:0287-01 సాళంగనాట సంపుటము: 03-500 పల్లవి: అదివో నీప్రతాపము హనుమంతా