పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 తుదిపద మిదియె ధృవమై కలిగె చ. తొడరి చిత్రకేతుఁడే నామము తడవి లోకమంతయు గెలిచె విడువక బ్రహ్మయు వెఁస నే నామము బడిబడి నుడుగుచు ప్రభుడై నిలిచె చ. హరుఁడే నామము అదె తారకముగ నిరతిఁ దడవి యెన్నిక మీటె ధర నేనామము దలఁచి నారదుఁడు సురమునియై సంస్తుతులకు నెక్కె చ. ధృవుఁడేనామము దొరకొని నుతియించి ధృవపట్టంబున తుద బ్రదికె జవళి శ్రీ వేంకటేశ్వరుదాసు లెల్లాను భువి నేనామము భోగించి మనిరి రేకు:0180-06 శంకరాభరణం సంపుటము: 02-402 పల్లవి: అదియే విష్ణుపదము ఆతుమకు నెలవు అదే జననకారణ మాకాశపదము చ. మంచిమాఁటలైనాఁ గానిమాటలైన నొకచోట మంచిముంచి యూకాశముననే యణఁగును యెంచరాని నిటూర్పు లెన్ని వొడమినాను అంచల నణఁగిపోవు నాకాశమును చ. చూపులెంత దవ్వెనా సూర్యచంద్రులఁ దాఁకి ఆపొంతనే యణఁగు నాకాశమునను రూపుల మైనీడలును రుచులఁ గాలత్రయము పైపైనే యణఁగును బహిరాకాశమున చ. యిలఁ జీఁకటి వెలుఁగు యొండ నహోరాత్రాలఁ గలసి మెలఁగు నాకాశతత్వమున చలువై శ్రీవేంకటేశు సాకారనిరాకారా లలలి వెలుఁగుచుOడు నOత్రరాకాశమున రేకు:0178-04 గుండక్రియసంపుటము:02-389 పల్లవి: అదియేల తా మాను మాయందు నిషూరమే కాక చెదరి విత్తాకటియుఁజెట్టొకటి యానా చ. కడుఁ బుణ్యపాపాలు గలిగిన జన్మము చెడుఁ బుణ్యపాపాలు సేయకుండీనా పుడమిలో ముష్టిమానఁ బొడమిన శాఖలు బడి ముష్టిపండై పండకుండీనా చ. పంచేంద్రియాలఁ బుట్టి పరగిన యీమేను పంచేంద్రియాలమీఁది భ్రమ మానీనా పొంచి హేయములోనఁ బుట్టిన కీటములెల్ల కొంచి హేయమే చవిగొనకుండీనా చ. శ్రీవేంకటేశ నీవు చేసిన యీమాయలు నీవల్ల మానుఁ గాక నేఁ గర్తనా దైవమవై నాలోనఁ దగిలి నాదురుణాలు వేవేగ మానుపఁగ వెతబీరెఁ గాక రేకు:0004-03 శ్రీరాగం సంపుటము: 01-023 పల్లవి: అదివో అల్లదివో హరివాసము