పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

121 బుదుటు జీవులము వున్నార మిదివో చ. వుదయాస్తమయము లొనరినవలెనే నిదురలు మేల్కను నియమములు కదిసి త్రిసంధ్యాకాలంబులవలె గుదిగొను దేహికి గుణత్రయములు చ. పుడమి నస్యములు పొదలినవలెనే వొడలిరోగము లున్న వివే వుడుగని వెలుపటి వుద్యోగమువలె కొడిసాగేటి మిత్రి కోలికలు చ. వెలుపలఁగల శ్రీ వేంకట విభుఁడే కలఁ డాతుమలో ఘనుఁడితఁడే చలమున నీతని శరణాగతియే ఫలమును భాగ్యము బహుసంపదలు రేకు:0006-05 శ్రీరాగం సంపుటము: 01-040 పల్లవి: అదిగాక నిజమతం బదిగాక యాజకం బదిగాక హృదయసుఖ మదిగాక పరము చ. అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు నమరినది సంకల్పమను మహపశువు ప్రమదమును యూపగంబమున విశసింపించి విమలేందు యాహుతులు వేల్పంగవలదా చ. అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగ దొరకొన్న శమదమాదులు దానధైర్యభాస్వరగుణాదులు విప్రసమితి గావలదా చ. తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు నరులకును సారీమపానంబు గావలదా పరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలో నరుహులై యవబృథం బాడంగవలదా రేకు: 0389-03 సామంతం సంపుటము: 04-516 పల్లవి: అదిగాన నీతి శాంతాలన్నిటకిఁ గారణము పదిలమై వివేకించి బ్రదుకఁగ వలయు చ. తఱచు మాఁటలాడితే తప్పలెన్నెనాఁ దొరలు పఱచై తిరిగితేను పాప మంటను మెఱసి తిరిగాడితే మిక్కిలి దూరు ముట్టు యొఱకగలవాఁడిందు నేమఱ డెప్పుడును చ. కన్నవెల్లాఁ జూచితే కడునాస లుప్పతిలు కన్నెలు పెక్కుగూడితే కరఁగు మేను సన్నలు సారెకునైతే చవుకౌ దొరతనము యిన్నిట నేర్పరైనవాఁ డేమఱఁ డెప్పుడును చ. మట్టుమీరి నవ్వితే మచ్చరా లూరకే పుట్టు గుట్టులేక నడచితేఁ గొంచపడును నెట్టినె శ్రీ వేంకటేశ నీకు శరణుచొచ్చి యిట్టె నీ దాసుఁడైనవాఁడేమరఁ డెప్పుడును పె.అ.రేకు:0026-01 శ్రీరాగం సంపుటము: 15-147 పల్లవి: అదియెపాణి శ్రీహరినామము