పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ
  • ఇంతటిదైవమవు మాకు నిటు నీవు గలుగఁగ
  • ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా
  • ఇంతయు నీమాయమయ మేగతిఁ దెలియఁగ వచ్చును
  • ఇంతలోనే యెచ్చరేది ఇంతలో మోసపోయేది
  • ఇంత్రిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను
  • ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
  • ఇంతే మరేమి లేదు యిందుమీఁదను
  • ఇంతే మటేమిలేదు యిందుమీఁదను
  • ఇంతే యింతే యీంకా నెంత చూచినా
  • ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు
  • ఇంతేపాశీ వారివారి హీనాధికము లెల్ల
  • ఇంతేసివారలకంటే నెక్కుడా తాము
  • ఇంద రెరిఁగినపని కిఁకఁ దప్పించుకోరాదు
  • ఇందలి జూచి చూచి యెఱఁగవద్దా
  • ఇందరి బుదులు యీశ్వరేచ్ఛకు సరిరావు
  • ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతి దే
  • ఇందరికంటె నెక్కుడు యెంచఁగ యోగీశ్వరుఁడు
  • ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి
  • ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు
  • ఇందరిపై భిన్నభక్తులేఁటికి మాకిఁక
  • ఇందరిలో నే మెందుఁబోలుదుము యిందరిఁ బోలిన జీవులమే
  • ఇందరు నీకొక్కసరి యొక్కువ తక్కువ లేదు
  • ఇందరు నెఱిఁగినదీ బదుకు
  • ఇందరు నెఱుఁగుదు రీయర్థయే భువి
  • ఇందరూ జీవులే యెంచి చూచితే
  • ఇందాకా వచ్చెఁ జేఁతలు యిఁకనో బుద్ధి
  • ఇందిరు వడ్డించ నింపుగను
  • ఇందిరకు నురము మీఁదిచ్చిన నాఁడు
  • ఇందిరయుఁ దానుఁ గూడి యిట్టె వరా లొరెసఁగుతా
  • ఇందిరా నాయక యిదివో మాపాటు
  • ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక
  • ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతే
  • ఇందిరానాథుఁడవు యిందరికి నేలికవు