పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 చ. యిసుక లెక్కవెట్టితే నెంతై నాఁ గలదు అసముదించని పుణ్యాలటువంటివే వసగాని పెక్కు దేవతలఁ గొలుచుకంటే సుసరాన హరివారై సుఖియుంచరో చ. గోడ గడుగఁగఁ బోతేఁ గొనదాఁకా రొంపే ఆడుకోలు తర్కవాదా లటువంటివే వాడిక నారుమతాలవాఁడై తిరుగుకంటే యీడనే శ్రీపతివారై యీడేరరో చ. మనసునఁ బాలు దాగితే మట్టు లేదు మేర లేదు అనుగు సంసారభోగా లటువంటివే దినదిన తపములఁ దీదీపులవుకంటే తనిసి శ్రీవేంకటేశుదాసులై బ్రదుకరో రేకు:0013-02 ఆహిరి సంపుటము: 01-078 పల్లవి: అతిదుషుఁడ నే నలసుఁడను యితర వివేకం బిఁకనేది చ. ఎక్కడ నెన్నిట యేని సేసితినొ నిక్కపుఁదప్పులు నేరములు గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది చ. ఘనోరపుఁబాపము కోట్ల సంఖ్యలు చేరువ నివె నాచేసినవి నీరసునకు నిటు నీకృప నాకిఁక కూరిమి నా యెడ గుణమేది చ. యేటిఁగి చేసినది యొఱఁగక చేసిన కొఱత్రలు నాయెడఁ గోటు లివే వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు మఱవక నాగతి మరి యేది రేకు:0025-06 లలిత సంపుటము: 01-154 పల్లవి: అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న హితవు చేకొననొల్ల రిందరు చ. కడలేని విజ్ఞానగతికిఁ దోడుగారు యెడపుల వారలె యిందరు అడరిన మోక్షసహయు లెవ్వరు లేరు యిడుమ పాట్లవారె యిందరు చ. తిరమైన పుణ్యము బోదించేవారు లేరు యెరపులవారే యిందరు తిరువేంకటాచలాధిపుని మీఁది చిత్త మిరపు నేయకపోయి రిందరు రేకు:0102-04 మలహరి సంపుటము: 02-010 పల్లవి: అతిసులభం బిది యందరిపాలికి