పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

117 చ. నకాదులు యే సర్వేశుఁ గొలిచిరి అనిశము శుకుఁ డెవ్వనిఁ దలఁచె మును ధ్రువుఁ డేదేవుని సన్నుతించె ఘననారదుఁ డేఘనునిఁ బొగడెను చ. యెలమి విభీషణుఁ డేదేవు శరణనె తలఁచె భీష్ముడేదైవమును బలు ప్రహ్లాదుని ప్రాణేశుఁ డెవ్వఁడు యిలలో వసిష్ణుఁ డేమూర్తిఁ దెలిసె చ. పురిగొని వ్యాసుడేపురుషునిఁ జెప్పెను తిరముగ నరుని దిక్కెవ్వఁడు మరిగిని యలమేల్మంగపతి యెవ్వఁడు గరిమల శ్రీవేంకటేశుఁ డీతఁడు రేకు:0070-06 సామంతం సంపుటము: 01-369 పల్లవి: అతనికెట్ల సతమైతినో కడు హిత్రవో పారిందులహిత్రవో యెఱఁగ చ. హృదయము తలఁపున నిరవయినఁగదా పదిలమయోను లోపలిమాట వెదకినచిత్తము వెర వెఱఁగదు నే - నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ చ. కాలూఁద మనసు గలిగికదా నా - తాలిమి మత్రిలోఁ దగులౌట మేలిమిపత్రిలో మెలఁగుటేదో నే - నేలో నే నిపుడెక్కడో యెఱఁగ చ. నేఁడని రేపని నే నెఱిఁగికదా పాశీఁడిమి మత్రిలో పొలుపాట వాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగె ఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ(రేకు 71 నుండి 77 వరకు లేవు) రేకు: 0319-03 లలిత సంపుటము:04-108 పల్లవి: అతనిభజియించరో ఆతుమలాల శ్రీ పతి యితనికరుణే ఫలమింతేకాని చ. సంగమే భంగమే సుండి సకలవిరక్తులాల వెంగలివిషయములే విషము సుండీ అంగపుబందువులెల్ల అంటుబంధములు సుండీ సంగతి హరి యొక్కఁడే సతమింతేకాని చ. మోహమే దాహముసుండి మోక్లోపాయకులాల సాహస సంసారమే నిస్సారము సుండి దేహము గొన్నాళ్ళకు సందేహమై తోఁచు సుండి శ్రీహరి సేవోక్కటే వచ్చినదింతేకాని చ. కోపమే తాపముసుండి కోరని సాత్వికులాల రూపులేని భోగమెల్ల రుణము సుండి కైపు సేసి యన్నిటాను గడిచి శ్రీవేంకటేశునోపి శరణని మనేదక్కటే సుండి రేకు:0298-03 వరాళి సంపుటము: 03-568 పల్లవి: అతనిలోనే యణఁగె నన్నియును కతలెన్నెనాఁ గలవు కమలాక్షుఁ గనరో