పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 చ. ఆసలకెల్లా గురి హరి యొక్కఁడేకాని వేసరక కన్నవారి వేఁడనోపను చేసేటిసేఁతకు గురి శ్రీవిభుఁడే కాని వాసి దప్పి హీనుల సేవలు సేయ నోపము చ. ముచ్చటకెల్లా గురి మురహరుఁడే కాని చెచ్చెర నెవ్వరికైనాఁ జెప్పనోపము నిచ్చలు మాబ్రదుకెల్లా నీలవర్ణునికే కాని రచ్చల దుషులతోడిరాఁపులకు నోపము చ. పరము నిహమునకు పరమాత్ముఁడే గురి పరులకధీనమైన బాఁతి యేఁటికి సిరులకెల్లా గురి శ్రీవేంకటేశుఁడేకాని అరపిరికితనపుటలమట లేదు రేకు:0161-02 లలిత సంపుటము:02-294 పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యాఁగాము లన్నియును అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ చ. కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా సరుగఁ బ్రాణము లొసంగి చైతన్య మతఁడే పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా చ. రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్పఁగఁ దాఁ గర్తా ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా చ. యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁడతఁడే అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త రేకు:0292-04 వసంతవరాళిసంపుటము: 03-533 పల్లవి: అతని నమ్మలేరల్పమతులు భువి నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు చ. సకలలోకపతి సర్వేశ్వరుఁడట వొకఁడిఁక దొర మరి వున్నాఁడా ప్రకటించఁగ శ్రీపతియే దాతట వెకలి నియ్యఁగొన వేరే కలరా చ. దివిజవందితుఁడు దిక్కుల హరియట యివల మొక్క సురలిఁక వేరీ కవ నంతర్యామి కరుణాకరుఁడట వివిధభంగులను వెదకంగనేలా చ. వేదాంగుఁడు శ్రీవేంకటపతి యట ఆదిమతము లిఁక నరసేదా యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁడీదేవుఁడె మన కిహపర మొసఁగ పె.అ.రేకు:0070-05 దేసాళం సంపుటము: 15-404 పల్లవి: అతనిఁ బాడెదను అది వ్రతము చతురుని శేషాచలనివాసుని