పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

115 చ. అనOత్రకరము లనOతాయుధము లనOతుడు ధరిOచెలర(గను కనుఁగోరెని శరణాగతులకు మనకును పనివడి యిఁక భయపడఁజోటేది చ. ధరణి నభయహస్తముతో నెప్పుడు హరి రక్షకుఁడై యలరఁగను నరహరికరుణే నమ్మినవారికి పరఁదున నిఁక భయపడఁజోటేది చ. శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు నావల నీవల నలరంగను దైవ శిఖామణి దాపగు మాకును భావింపఁగ భయపడఁజోటేది రేకు:0205-01 శంకరాభరణం సంపుటము: 03-025 పల్లవి: అతఁడే సకలము అని భావింపుచు నీతితో నడవక నిలుకడ యేది చ. యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ విందుల మనసుకు వెలితేది సందడించే హరిచైతన్య మిదివో కందువలిఁక వెదకఁగ నేది చ. అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ పంతపు కర్మపు భయమేది సంతత మాతఁడే స్వతంత్రుఁడిదివో కొంత్రగొంత్ర మల కోరెడి దేది చ. శ్రీవేంకటపతి జీవుని నేలఁగ యీవల సందేహ మిఁక నేది భావం బీతఁడు ప్రపంచ మీతఁడు వేవేలుగ మరి వెదకెడి దేది రేకు:0068-02 సామంతంసంపుటము: 01-353 పల్లవి: అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ - డతఁడు దలఁపుల ముంగిట నబ్బుట యెన్నఁడొకో చ. సారేకు సంసారంబను జలనిధు లీఁదుచు నలసిన వారికి నొకదరిదాపగు వాఁడిఁక నెవ్వఁడొకో పేరిన యజ్ఞానంబను పెనుఁజీఁకటి తనుఁగప్పిన చేరువవెలుఁగై తోఁపెడిచెలి యికఁ నెవ్వఁడొకో చ. దురితపుకాననములలో త్రోవటు దప్పినవారికి తెరు విదె కొమ్మని చూపెడిదేవుఁడి దెవ్వఁడొకో పెరిగిన యాశాపాశము పెడగేలుగఁ దనుఁగట్టిన వెరవకుమని విడిపించేటి విభుఁడిఁక నెవ్వఁడొకో చ. తగిలిన యూపదలనియెడి దావానలముల చుట్టిన బెగడకుమని వడినార్పెడి బిరుదిఁక నెవ్వఁడొకో తెగువయుఁ దెంపును గలిగిన తిరువేంకట విభుఁడొక్కఁడే సారెగిసి త్రలంచినవారికి సురతరువగువాఁడు రేకు: 0303-01 శంకరాభరణం సంపుటము: 04-013 పల్లవి: అతఁడేమి సేసినా మాకదే గురి మతిలో నాతఁడుండఁగా మాయలు మాకేఁటికి