పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 డతనికంటే మరి యధికులు వేరయ్యా చ. కమలవాసిని లక్షికలదా యెవ్వరికైనాఁ గమలనాభునికి నొక్కని కే కాక కమలజుఁడైన బ్రహ్మ కలఁడా యెవ్వని నాభినమరవంద్యుఁడు మా హరికే కాక చ. అందరు నుండెడి భూమి యన్యులకుఁ గలదా అందపు గోవిందునికే ఆలాయఁగాక చెందిన భాగీరథి శ్రీపాదాలఁ గలదా మందరధరుఁడయిన మాధవునికిఁ గాక చ. నిచ్చలు నభయమిచ్చేనేరుపు యెందుఁ గలదా అచ్చుగ నారాయణునియందే కాక రచ్చల శరణాగత రక్షణ మెందుఁ గలదా తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకే కాక రేకు: 0366-01 ముఖారి సంపుటము:04-387 పల్లవి: అతఁడే యొక్కుడుదైవ మందరికంటే తతినింకాఁ జెప్పిచూప దైవాలు గలవా చ. జలధి దచ్చేనాఁడు సకల దేవత లుండ యెలమి నేదేవుఁ జేరె నిందిరాదేవి అల గజేంద్రుఁడు మూలమని మొరవెట్టునాఁడు వెలయ నే దేవుఁడు విచ్చేసి కాచెను చ. పుడమి గొలుచునాఁడు పొడవైన దేవతలు కెడసి యెవ్వరడుగు కింద దాఁగిరి కడలేని జగములు గల్పించే బ్రహ్మదేవుఁ - డడరి యే దేవు నాభియందుఁ బుట్టెను చ. యెంచి నాఁడు దేవతల నింద్రియాల జొక్కించే - పంచబాణుఁ డేదేవునిపట్టి, యిపుడు కొంచక శ్రీ వేంకటాద్రిఁగోరిన వరము లిచ్చి అంచల లోకములేలీ నండనే దేవుఁడు రేకు: 0376-01 లలితసంపుటము: 04-442 పల్లవి: అతఁడే యెరుఁగును మముఁబుట్టించినయంతరాత్మయగునీశ్వరుఁడు అతికీ నతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారం బిఁక నేదో చ. కనుచున్నారము సూర్యచంద్రులకు ఘనవుదయాస్తమయములు వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలికథలెల్లా మనుచున్నారము నానాఁటికి మాయలసంసారములోన తనిసీఁదనియము తెలిసీఁదెలియము తరువాతి పనులిఁక నేవో చ. తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్గార్జన కొరకు పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై పెరిగెద మిదివో చచ్చెడి పుట్టెడి భీతిగలుగు దేహములోనే విరసము లెరఁగము మరచీ మరవము వెనకటికాలము విధియేదో చ. అట్టెనారము హరినుతిచే నాఱడి గురువనుమతిని పట్టినారమిదె భక్తిమార్గమిదె బలువగు విజ్ఞానముచేత గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో రేకు:0364-06 దేశాక్షి సంపుటము:04-380 పల్లవి: అతఁడే రక్షకుఁ డందరి కతఁడే పతి యుండఁగ భయపడఁ జోటేది