పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

113 రేకు: 0165-02 నాదరామక్రియ సంపుటము: 02-313 పల్లవి: అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూరుఁడు చతురుఁడితఁడే రక్షించఁగలవాఁడు శరణని బ్రదుకవో వో మనసా చ. మరుతండ్రిఁ జూచిన మంచికన్నులను మరొకరిఁ జూచిన నింపౌనా సిరువరు నామమునొడిగిన నోరను చిక్కిన పేరులు యితవెనా పరమాత్ముఁ దలచిన మనసులోపలను పరులఁ దలఁచితే నొడంబడునా కరుణానిధి పుణ్యకథలువినిన చెవుల కడలసుద్దులు విన సమ్మతించునా చ. నరహరిఁ బూజించినయట్టి కరములు నరుల సేవసేయ నరుహములా మురపూరు శరణని మొక్కిన శిరసున మూడులకు మొక్క నుచితములా హరిమందిరమున కరిగెడు పదములు అధములిండ్ల కేఁగఁగ నలవడునా పురుషోత్తము లాంఛనము మోచిన మేను భువి హీనవృత్తికిఁ బొసంగీనా చ. గోవిందుఁడే దిక్కె వుండు ఘనులకు కొలిపీనా దేవతాంతరంబులు భూవల్లభుదెస బుట్టిన జ్ఞానము పొంది వేరొకట నిలిచీనా శ్రీవేంకటపతిపై నిడిన భక్తి చెలులపై నునుపఁగఁ దగవవునా దేవకినందనుఁడితనిదాసులఁ దెలియఁగ జడులకుఁ దరమయిన్యానా పె.అ.రేకు:0019-06 సామంతం సంపుటము: 15-110 పల్లవి: అతఁడే గతి యంటి నన్నిటా మాన్యుఁడే యితరములు మానఁగా నితనికే శలవు చ. మీఱి శ్రీ రమణుని మెప్పించు సేవకులకు వీటిడి కర్మముల వెట్టి మాన్యము ఆఱడి యితని భక్తులైన చనవరులకు ఆఱితేరి పుణ్యపాపా లడ్డపాటి లేదు చ. తక్కక యితని ముద్ర ధరించే దాసులకు చొక్కుల భవబంధపు సుంకమాన్యము లెక్కించి యితనికైన లెంకలకు జోడు కల కొక్కట విధినిషేదా లూహింప లేవు చ. సరుస శ్రీ వేంకటేశు శరణాగతులకును పరగ మాయల దొడ్డి బందె మాన్యము పరమైన యీతని పళ్లేము కూటివారికి తరితో జగములోని తప్పాప్పులే లేవు రేకు:0199-04 ముఖారి సంపుటము:02-511 పల్లవి: అతఁడే గతియని యంటే నన్నిటా మాన్యుఁడు ఇతరాలు మానఁగానే యీతనికే శలవు చ. శ్రీరమణుని నిత్యసేవకులకుఁ దొల్లె వేరులేని కర్మముల వెట్టి మాన్యము ఆరీతి నితనిభక్తులైన చనవరులకు ఆరితేరి పుణ్యపాపా లడ్డపాటు లేదు చ. తక్కక యితనిముద్ర ధరించిన దాసులకు చొక్కుల భవబంధాల సుంక మాన్యము లెక్కించ నితనికైన లెంకలకు బొడుకలకొక్కట విధినిషేధా లూహింపలేవు చ. సరుస శ్రీవేంకటేశు శరణాగతులకును పరగ మాయల దొడ్డిబందె మాన్యము పరమమైన యితని పళ్లేముకూటివారికి ధరలో నేమిటివంకాఁ దప్పులే లేవు రేకు:0282-01 లలిత సంపుటము: 03-470 పల్లవి: అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ