పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

112 రేకు: 0186-01 దేవగాంధారిసంపుటము: 02-432 పల్లవి: అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము చ. వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము ఆదినంత్యములేని యారూపము పాదుగ యోగీంద్రులు భావించు రూపము యూదెస నిదివో కోనేటిదల రూపము చ. పాలజలనిధిలోనఁ బవళించే రూపము కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనదిదే శేషగిరిమీఁది రూపము చ. ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మల్ట్రాకుమీఁది కొన రూపము మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము రేకు:0070-02 శ్రీరాగం సంపుటము: 01-365 పల్లవి: అణురేణు పరిపూరుఁడైన శ్రీవల్లభుని బ్రణుతించువారువో బ్రాహ్మలు చ. హరి నామములనె సంధ్యాది విధులొనరించు పరిపూర్ణమతులు వో బ్రాహ్మలు హరి మంత్ర వేద పారాయణులు హరి భక్తి పరులైన వారువో బ్రాహ్మలు చ. యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు భావించువారువో బ్రాహ్మలు దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు పావనులు వారువో బ్రాహ్మలు చ. ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁ బాదుకొలిపిన వారు బ్రాహ్మలు వేద రక్షకుఁడైన వేంకట గిరీశ్వరుని పాద సేవకులవో బ్రాహ్మలు రేకు: 0310-05 గుండక్రియసంపుటము:04-059 పల్లవి: అతఁడు లక్షీకాంతుఁ డన్నియు నొసఁగుఁగాక యితరుల వేఁడుకొంటే నేమి గలదు చ. మోదముతో నొకమాని మొదలఁ బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుఁగాక ఆదిమూలమగుహరి నాతుమ సేవించక యే దైవములఁగన్నా నేమి సెలవు చ. తల్లి భుజించినవెల్లా తగు గర్భము శిశువు కెల్లగాఁగఁ బరిణామ మిచ్చుఁగాక వుల్లము లోపలి హరి కొసగని పూజలెల్లా వెల్లిఁ జింతపంటివలె వృథా వృథా చ. వోలి నెంత జారిపడ్డా నూరకే యెవ్వరికైనా నేలే యాధారమై నిలుచుఁగాక తాలిమి శ్రీవేంకటేశుఁదలఁచక తలఁచినా పాలించ నాతఁడేకాక పరులకు వశమా