పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

111 రేకు: 0195-05 దేవగాంధారి సంపుటము:02-490 పల్లవి: అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు వొడ్డిన దనుభవించే దోపిక జీవులది చ. యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు Sశీలకలు గోరెనసాగెఁ గోత్రీూనఁగోటి నారుకొనె సంపదలు నానారూపములై తీరదేమిటా నీచిక్కు దేవుఁడు వెట్టినది చ. అల్లుకొనెఁ గర్మములు అక్కడికి నిక్కడికి వెల్లవిరాయను మాయ వెనకా ముందు కెల్లరేగె దేహమందే కిమ్మల చుట్టరికాలు పొల్లువో దెన్నఁడు భూమి పుట్టగాఁ బుట్టినది చ. పండెను సంసారము ఫలమైన నానాఁటికి నిండెను నాలికకు నెమ్మదిఁ జవులు అండనే శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి వండ వండనట్లుగ (?) వన్నె కెక్కెంచినది రేకు:0315-06 బౌళిసంపుటము: 04-089 పల్లవి: అడ్డములేనినాలిక నాడుదురుగాక భూమి దొడ్డవాఁడేమి సేసినా దోస మందు నేది చ. ఆతుమలో మదనుఁడవయ్యే వాఁడవు నీవే ఆతల నాలిమగఁడువనే వాఁరలు నీవే ఘూతల పరాంగనఁ గలసితివని నిన్ను తోతో మునుల కిఁక దూరఁ జోటేదయ్యా చ. దేహము లోపలనున్న దీపనాగ్నియు నీవే దాహము నాఁకలి నీవే తగురుచులెల్ల నీవే ఆహా శబరియెంగి లారగించి త్రనుమూట సాహల నిందించి నవ్వఁ జోటిందు నేది చ. పుట్టుగు లోపలనున్న భోగము లన్నియు నీవే ఇట్టే ఆచారములు హీనాధికములు నీవే గుట్టున శ్రీవేంకటేశ గొల్లఁడవై పుట్టినందుకుట్టిపడి యెవ్వరికి నూహించఁజోటేది రేకు:0260-05 సామంతంసంపుటము: 03-347 పల్లవి: అణుమాత్రపు దేహినంతే నేను ముణిఁగెద లేచెద ముందర గానను చ. తగు సంసారపు తరఁగలు నీమాయ నిగమముల యడవి నీమాయ పగలునిద్రలు వుచ్చే భవములు నీమాయ గగనపు నీమాయఁ గడవఁగ వశమూ చ. బయలువందిలి కర్మబంధములు నీమాయ నియమపుఁ బెనుగాలి నీమాయ క్రియ నిసుకపాఁతర కెల్లోత్తు నీమాయ జయమంది వెడలఁగ జనులకు వశమూ చ. కులధనములతోఁ జిగురుఁగండె నీమాయ నిలువు నివురగాయ (?) నీమాయ యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని గెలుచుటఁ గాక యుది గెలువఁగ వశమూ